Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లోని డిజాస్టర్ సినిమాలు ఇవే!

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే, బాలయ్య నటించిన చిత్రాల్లో బాక్సీఫాసు వద్ద బోల్తా కొట్టిన చిత్రాల లిస్టు కూడా పెద్దదే. ఓ సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అని ముందే అంచనా వేయడం చాలా కష్టం. సినిమా విడుదలై టాక్ వస్తేగానీ ఓ అంచనాకు రాలేరు. కథ, కథనం, హీరో నటన, కామెడీ, డాన్స్, పాటలు, నేపథ్య సంగీతం.. ఇలా అనేక అంశాలపై సినిమా హిట్ అయ్యేదీ, ప్లాప్ అయ్యేదీ ఆధారపడి ఉంటుంది.

బడా హీరోల విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా డిజాస్టర్ గా నిలిచే ప్రమాదం ఉంటుంది. ఫ్యాన్స్ ఆగ్రహం, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, థియేటర్ల ఓనర్లు.. ఇలా చాలా నష్టాలు భరించాల్సి వస్తుంది. ఇలాంటి ఎంపికలు, పొరపాట్లు చేసినందుకేనేమో.. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి.

ప్రయోగాలకు వాడుకున్నారా?

బాలయ్య సాధారణంగా కొత్త దర్శకులైనా, పాత దర్శకులైనా సినిమా ఒప్పేసుకుంటూ ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ బలహీనతతోనే బాలయ్యను ప్రయోగాలకు వాడుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయని చెబుతున్నారు.

బాలయ్య తన కెరీర్ లో నటించిన 20 సినిమాలు ప్లాప్ లిస్టులో ఉన్నాయి. జననీ జన్మభూమి, కత్తుల కొండయ్య, అల్లరి కృష్ణయ్య, సాహస సామ్రాట్, ప్రాణానికి ప్రాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, గాండీవం, నిప్పురవ్వ, దేవుడు, కృష్ణబాబు, వంశోద్ధారకుడు, పలనాటి బ్రహ్మనాయుడు, విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, శ్రీమన్నారాయణ, మహారథి, ఒక్కమగాడు, పరమవీర చక్ర, రూలర్ తదితర చిత్రాలు ఆల్ టైమ్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -