Telangana: తెలంగాణలో డాగ్ బర్త్ పార్టీ.. అతిథులకు విందు.. పార్టీ ఎక్కడంటే

Telangana సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. వాటిని ఇంట్లో కుటుంబసభ్యుల మాదిరే ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటూ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అయితే, వాటికి కొందరు బర్త్ డేలు కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇంటిల్లిపాదీ సంతోషంగా గడుపుతుంటారు. ఇప్పుడు ఇలాంటి పార్టీల కల్చర్ పెరిగింది.

కుక్కకు బర్త్ డే వేడుకలతో వార్తల్లో నిలిచిన కుటుంబం..

ఇంట్లో సమయం గడవక బోరింగ్ గా ఫీల్ అయ్యే వారు ఎక్కువ మంది పెట్ లను పెంచుకుంటూ ఉంటారు. వాటికి కావాల్సిన పెడిగ్రీ టైమ్ కు అందిస్తూ ముద్దుగా పెంచుకుంటారు. తాజాగా ఓ కుటుంబం పెట్ కు బర్త్ డే గ్రాండ్ గా చేసి వార్తల్లోకి ఎక్కింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ కుటుంబం తాము పెంచుకుంటున్న కుక్కకు పుట్టిన రోజు వేడుకను అట్టహాసంగా జరిపింది.

మనుషులు ఎలా బర్త్ డే చేసుకుంటారో కుక్కకు కూడా అలాగే నిర్వహించారు. పెట్ బర్త్ డే సందర్భంగా ఇంటికి డెకరేషన్ కూడా చేశారు. కేక్ కట్ చేయించారు. ఈ ఫంక్షన్ కు స్నేహితులు, బంధువులను పిలిచి వివిధ రకాల వంటకాలు చేసి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పెట్ పేరు మిల్కీ అని పెట్టుకున్నారట. హ్యాపీ బర్త్ డే మిల్కీ అనే ఫ్లెక్సీ కూడా వేయించారు.

కుక్క బర్త్ డే సందర్భంగా విజయవాడలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ తో డ్రస్ కూడా కుట్టించారు. అశ్వరావుపేట ఓఎన్జీస్ విశ్రాంత ఉద్యోగి మోటపర్తి వీరయ్య చౌదరి, రత్నకుమారి దంపతులు ఇలా కుక్క బర్త్ డే వేడుకలు ఘనంగా చేశారు. ఏటా ఇలాగే చేస్తున్నామని తెలిపారు. అయితే, దీనిపై స్థానికులు భిన్నంగా స్పందిస్తున్నారు. కుక్కకు బర్త్ డే ఏంటి విడ్డూరం కాకపోతేనూ.. అని ఒకరు కామెంట్ చేశారు. చాలా ఫన్నీగా ఉందంటూ మరొకరు చెప్పారు. జంతు ప్రేమికులు మాత్రం సంబరపడిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -