CM Jagan: జగన్ స్వయంకృతాపరాధాలే వైసీపీని ముంచేయబోతున్నాయా.. ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయమా?

CM Jagan: సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనిపిస్తే ఎవరైనా కూడా వారితో గౌరవంగా మాట్లాడతారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ లేదంటే నమస్కారం చేస్తూ వారితో గౌరవంగా మాట్లాడుతారు కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు చీదరించుకుంటున్నారు. ఇటీవల ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా అక్కడ తనకు చేదు అనుభవం ఎదురు కావడంతో జగన్మోహన్ రెడ్డి మాట కూడా మాట్లాడకుండా వేరే చోటికి వెళ్లిపోయారు. అయితే అక్కడ కూడా ఆయనకు తీవ్రస్థాయిలో విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడం చూసి కాస్త అసహనానికి లోనవుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా తాను ఎంతో మేలు చేశానని జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెబుతూ వచ్చారు. ఏదో ప్రతి కుటుంబానికి 5000 లేదంటే 10000 అకౌంట్లో వేసి తాను సంక్షేమ ఫలాలను అందిస్తున్నానని గొప్పలు చెబుతున్నారు.

అయితే ప్రజలందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు .ఈయన ఇచ్చిన దానికంటే ప్రజల నుంచి తీసుకున్నది ఎక్కువగా ఉందని గ్రహించినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వ్యతిరేకత కూడా ఏర్పరచుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతుంది.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పరిపాలించిన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని ఇలాంటి ముఖ్యమంత్రి మనకు వద్దు అంటూ ఈసారి ప్రజలందరూ కూడా మార్పును కోరుతూ వచ్చే ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఓటుతో ప్రజలందరూ ఫ్యాన్ రెక్కలు విరవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా వైసిపి స్వయంకృపరాధమే అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -