Kavitha: లిక్కర్ స్కాంలో కవిత? బీజేపీ ఎంపీ దగ్గర పక్కా ఆధారాలు

Kavitha: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఉన్నట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లో తెలంగాణకు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి పేరు ఉండటం సంచలనంగా మారింది. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల పాత్ర కూడా ఉందనే వార్తలు దుమారం రేపుతున్నాయి. తెలంగాణకే కాకుండా ఏపీకి చెందిన వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది.

ఈ క్రమంలో వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. సీఎం కేసీఆర్ కూతరు కవిత పాత్ర ఇందులో ఉందని ఆరోపించారు. ఢిల్లీ ఒబేరాయ్ హోటల్ లో ఎక్సైజ్ పాలసీ రూపొందించారని, ఎక్సైజ్ కమిషనర్ ఢిల్లీ డిప్యూటీ సీఎం, లిక్కర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబీకులు ఈ డీల్ లో ఉన్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబీకులు ఓ ప్రైవేట్ విమానంలో వచ్చేవారని, తెలంగాణలోని మద్యం మాఫియాకి చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన విమానంలో వచ్చేవారని ఎంపీ పర్వేశ్ సాహిబ్ ఆరోపించారు.

తెలంగాణకు చెందిన వ్యక్తే ఒబేరాయ్ హోటల్ లో సూట్ రూమ్ బుక్ చేసేవారని తెలిపారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి తెలంగాణలోని మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఈ పాలసీని రూపొందించారని వివరించారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ లో ఇదే లిక్కర్ పాలసీ అమలవుతోందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎన్ 1 లైసెన్స్ హోల్డర్స్ తమ వ్యక్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారని ఎంపీ తెలిపారు.

ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ కింద సిసోడియాకు రూ.150 కోట్లు ఇచ్చారని, దీనికి బదులుగా ఎన్ 1 కమిషన్ కు ముందుగా లాభాలు, తర్వాత మీరు తీసుకోవాలని డీల్ కుదుర్చుకున్నారని ఎంపీ చెప్పారు. కేసీఆర్ కుటుంబీకులతో మీటింగ్ జరిపారా? లేదా? అనేది సిసోడియా చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కుటుంబ సభ్యులతో కేజ్రీవాల్, సిసోడియా సమావేశమయ్యారా లేదా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు ముందు నిజాలు అంగీకరించాలని సిసోడియాకు స్నేహితుడిగా సలహాలు ఇస్తున్నట్లు ఎంపీ పర్వేశ్ సాహిబ్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం గురించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో సీఎం కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని బీజేపీ ఎంపీ కీలక విషయాలు బయటపెట్టడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ చెప్పడంతో.. ఇంకెన్ని విషయాల్లో బయటపెడతారనేది టీఆర్ఎస్ లో గుబులో రేపుతోంది. కేసీఆర్ మెడకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు చిక్కుకోవడంతో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది గులాబీ శ్రేణుల్లో ఆందోళన రేపుతోంది. కవిత పేరు బయటపెట్టడంతో ఆమె చిక్కుల్లో పడినట్లు అయింది. మరి రానున్న కొద్దిరోజుల్లో ఈ లిక్కర్ కుంభకోణం కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -