BJP: బీజేపీ టార్గెట్ 30.. ఆ వర్గాలపై ఫోకస్

BJP: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో ఎన్నికలకు ఇప్పటినుంచే సంసిద్దమవుతోంది. రాజకీయ హీట్ ను మరింత పెంచేస్తోంది. టీఆర్ఎస్ ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో.. అన్ని రకాలుగా అధికార టీఆర్ఎస్ ను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోంది. అస్త్రశస్త్రాలను టీఆర్ఎస్ పై ప్రయోగిస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు వ్యూహలు రచిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది.

అయితే బీజేపీ అధికారంలోకి రావడం అంత సులువు కాదు. టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారమని, బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కూడా పోటీ పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల నేతలు విబేధాలను వదిలేసి ఏకతాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డికి సహకరిస్తే.. కాంగ్రెస్ మరింత బలం పుంచుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న క్రమంలో బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ప్రస్తుతం తమకు తెలంగాణలో 20 శాతం ఓటు బ్యాంకు ఉందని బీజేపీ నమ్ముతోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 20 శాతం ఓట్లు వస్తాయని సర్వేల ద్వారా అంచనా వేసింది. దీంతో మరో 15 శాతం ఓటు హక్కును సంపాదించుకుంటే 35 శాతం వస్తుందని, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కమలనాధులు చెబుుతుున్నారు. కానీ ఏడాది సమయంలోనే 15 శాతం ఓట్లు బ్యాంకును ఆకర్షించడం అసాధ్యమైన పని. రాష్ట్రంలో సెటిలర్ల ఓటర్లు, మైనారిటీ వర్గాల ఓటర్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటర్లు చాలామంది ఉన్నారు. మైనారిటీ ఓటర్లు ఎంఐఎం వైపు ఉంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో మైనారిటీల బ్యాంకు ఉంది. ఇక్కడ ఎంఐఎంకు అనుకూలంగా ఉంటుంది.

ఇక 31 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లు బ్యాంకు ఉంది. దీంతో ఎస్సీ,ఎస్టీల ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, హయత్ నగర్, లింగంపల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో సెటిలర్ల ఓటర్లు ఉండగా.. సెటిలర్లు ఎప్పటినుంచో టీఆర్ఎస్ వైపు ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సెటిలర్లు, మైనారిటీ, ఎస్సీ,ఎస్టీ ఓటర్లను బీజేపీ ఆకర్షించడం చాలా కష్టతరమైన పని అని చెప్పవచ్చు. ఇక విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన కేంద్రం నేరవేర్చలేదు. దీంతో ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఉంది.

కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకను క్యాష్ చేసుకోవాలన్నా.. బీజేపీనే విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మొత్తం బీజేపీ వైపు వెళ్లదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి 35 శాతం ఓట్ బ్యాంక్ రావడం కష్టతరమైన పని. మరి 35 శాతం ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ ఎలాంటి వ్యూహలు అమలు చేస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -