MP K Laxman: టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ సీనియర్ నేత

MP K Laxman: ఎన్డీయేలోకి టీడీపీ? దసరా లేదా దీపావళి తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశముందనే వార్త గత వారం రోజులుగా జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి రిపబ్లిక్ టీవీ వరకు జాతీయ మీడియా ఛానెళ్లు, పత్రికలు ఎన్టీయేలోకి టీడీపీ చేరబోతుందనే వార్తలను ప్రసారం చేయడంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలోని టీడీపీ, కమ్మ సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవచ్చని, ఏపీలో కూడా రెండు, మూడు అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ సీట్లనైనా గెలుచుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుకు నమ్మినబంటు అయిన రామోజీరావుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ-బీజేపీ పొత్తుకు రామోజీరావు రాయబారం నడుపుతున్నారని, మధ్యవర్తిత్వం వహించి టీడీపీ-బీజేపీ పొత్తు కన్ఫార్మ్ అయ్యేలా చూస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్డీయేలో టీడీపీ చేరడం ఖాయమనే టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలో ఎన్డీయేలో టీడీపీ చేరడంపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు గురించి ఎలాంటి చర్చ బీజేపీలో లేదని, అది అంతా ప్రచారమే అని కొట్టివేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటే మీడియాకు వెల్లడిస్తానని, ఏపీలో మాత్రం జనసేనకు కలిసి పోటీ చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. కర్ణాటకలో సింగిల్ గా పోటీ చేసిన అధికారంలోకి వచ్చినట్లుగానే.. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ బల పడుతుందని, తెలంగాణలో కూడా బలపడుతుందని చెప్పారు. మునుగోడులో ఎన్ని కుట్రలు చేసినా బీజేపీనే గెలుస్తుందన్నారు. మునుగోడులో బీజేపీ గెలుపుతో కేసీఆర్ పతనం మొదలు అవుతుందని లక్ష్మణ్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -