DK Aruna: డీకే అరుణ అక్కర్లేదని క్లారిటీ ఇచ్చేసిన బీజేపీ పార్టీ.. అసలేం జరిగిందంటే?

DK Aruna:  తెలంగాణలో మరో రెండు నెలలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిజెపి కూడా ఇదివరకే కొంతమంది పేర్లను విడుదల చేసింది. బీజేపీ జాతీయ నాయకత్వం శుక్రవారం రెండో జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో కేవలం ఒకే ఒక్క పేరు ఉండడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

మొదటి నుంచీ మహబూబ్‌నగర్‌ సీటు తనకు కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతూ వస్తున్నారు. అదే సమయంలో ఆ సీటు కోసం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఒత్తిడి చేస్తున్నారు. తన కొడుకు కోసం గట్టి ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. అందులో భాగంగానే ఆ సీటును జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి కేటాయించింది. ఇలా అప్పటికప్పుడు ఈ ఒక్క పేరును ప్రకటించకపోవడంతో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీరి పేరు ఒక్కటే ప్రకటించారు.

ఈ విధంగా తమకే ఈ సీటు కేటాయిస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నటువంటి డీకే అరుణకు ఈసారి కూడా నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇలా బిజెపి నుంచి ఈ విధమైనటువంటి ప్రకటనలో రావడంతో చాలామంది తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ పార్టీ వీడి హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడంతో బిజెపికి తెలంగాణలో కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ రెండో లిస్టుపై ఆధారపడి బీజేపీ అభ్యర్థుల కోసం ఎదురు చూస్తోంది. హస్తం పార్టీలో సీటు దక్కని అసంతృప్త నేతలు తమవైపు వస్తారని ఆశతో ఎదురుచూస్తున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీలో సీటు దక్కని వారు తమ వైపు వస్తారని బిజెపి ఆశగా ఎదురుచూస్తున్న అది కూడా జరగదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇప్పుడు డీకే అరుణ తమ పార్టీకి అక్కర్లేదని ఈ సందర్భంగా బిజెపి చెప్పకనే చెప్పడంతో ఈమె కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -