BJP-Jr NTR: ఎన్టీఆర్‌తో బీజేపీ మైండ్ గేమ్ పాలిటిక్స్.. సోము కామెంట్స్ కు కారణమిదేనా?

BJP-Jr NTR: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ తర్వాత అనేక రూమర్లు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయంగా ఎన్టీఆర్ ను బీజేపీ ఉపయోగించుకోబోతుందనే ఊహాగానాలు ప్రధానంగా వినిపించాయి. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహించుకున్నారు. కానీ అసలు ఈ భేటీలో ఏం చర్చ జరిగిందనేది మాత్రం బయటకు రాలేదు. సినిమాల గురించి అయితే మాత్రం కాదని, రాజకీయాల గురించే చర్చించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ తమకు అనుకూలంగా ఉన్నారని చెప్పడం ద్వారా ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపి లబ్ధి పొందాలని బీజేపీ చూసిందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ భేటీ ముగిసి చాలా రోజుల అయినా ఎన్టీఆర్ వ్యవహారం ఇంకా తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గానే మారుతూ ఉంది. బీజేపీ నేతలు అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్యణ్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయ అంశాలు చర్చకు రాలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ఇక లక్ష్మణ్ మాత్రం అమిత్ షాతో జరిగిన భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని, ఎన్టీఆర్ మోదీ పాలన పట్ల సానుకూలంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ వస్తే ప్రచారం చేయించుకుంటాని లక్ష్మణ్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరింత ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని, ప్రచారం చేయించుకుంటాని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు మంచి ప్రజాదరణ ఉందని, ఎక్కడ ప్రజాదరణ ఉందో అక్కడ ఆయన సేవలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోన్నాయి.

బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు, ప్రచారం చేస్తానని ఎన్టీఆర్ ఎక్కడా ప్రకటించలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఎన్టీఆర్ ఉన్నారు. సినిమాలతోనే బిజీగా గడుపుతున్నారు. పూర్తిగా రాజకీయాలను దూరం పెట్టేశారు. ఇలాంటి తరుణంలో బీజేపీ నేతలు ఎన్టీఆర్ సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని కామెంట్స్ చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీకి ఎన్టీఆర్ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, తమ పార్టీకి క్రేజ్ పెరుగుతుందని బీజేపీ నేతలు తమ పార్టీ కోసం ఎన్టీఆర్ ను వాడుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.

తమ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు క్రియేట్ చేస్తుండటంపై తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ తమ పార్టీ వైపు ఉన్నాడని చెప్పుకోవడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, ఇది కరెక్ట్ పద్దతి కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. అన్ని పార్టీలలో ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఉన్నారని, ఒక పార్టీకి పరిమితం చేయవద్దని చెబుతున్నారు. ఒక పార్టీకి ఎన్టీఆర్ ను పరిమితం చేయడం వల్ల మిగతా పార్టీలలోని ఫ్యాన్స్ దూరమయ్యే అవకాశం ఉంటుందని, బీజేపీ నేతలు ఎలా పడితే అలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.

అయితే ఎన్టీఆర్ పట్ల బీజేపీ నేతలు వ్యూహత్మకంగా వ్యహరిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని కామెంట్స్ చేయడం వల్ల ఓటర్లు ఆకర్షితులవుతారని భావిస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పై బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పడం వల్ల ఆయన అభిమానులతో పాటు కొన్ని సామాజికవ వర్గాలు తమవైపు వస్తాయిన బీజేపీ భావిస్తోంది. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ పట్ల బీజేపీ నేతల కామెంట్స్ కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు.

కేంద్ర హోమంత్రి పిలిచారు కనుక ఎన్టీఆర్ వెళ్లి గౌరవప్రమాదంగా కలవాల్సి వచ్చిందని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. అలా కలిసినందుకే బీజేపీ నేతలు ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా రాద్దాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ ఎలాంటి ప్రకటన చేయకుండానే బీజేపీ నేతలు ఇలా ఆపాదించుకోవడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు చేసే కామెంట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటున్నారు. సమయం వచ్చినప్పుడు సరైన రితీలో సమాధానం చెబుతామని అంటున్నారు. బీజేపీ నేతలు అలాంటి కామెంట్స్ మానుకోవాలని తారక్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.

– వై. పార్వతి, సీనియర్‌ జర్నలిస్ట్‌ (arshtunnu2000@gmail.com)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -