CM KCR: కేసీఆర్‌కు భారీ షాకిచ్చేలా బీజేపీ ప్లాన్.. టీఆర్ఎస్ నుంచి మంత్రులు, ఎంపీలు జంప్?

CM KCR: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య బైపోల్ వార్ తారాస్థాయిలో జరుగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య వ్యూహ, ప్రతివ్యూహలతో రాష్ట్ర రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. నేతలు వరుస పెట్టి కండువాలు మార్చేస్తుండటంతో అసలు ఏం జరుగుతుందనేది సామాన్య ప్రజలకు అర్ధం కావడం లేదు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారనేది కూడా అర్ధం కావడం లేదు. రాత్రికి రాత్రే నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. మునుగోడు ఉపఎన్నిక వేళ నేతల జంపింగ్‌లతో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. రానున్న కొద్దిరోజుల్లో మరికొంతంది కీలక నేతలు పార్టీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తర్వాత జంపింగ్ లు మరింత పెరిగే అకవాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఫలితాలను బట్టి పార్టీ మారే ఆలోచనలో చాలామంది నేతలు ఉన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫలితం వస్తే ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న చాలామంది నేతలు కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఫలితం వస్తే.. ఆ పార్టీలోని కొంతమంది కీలక నేతలు అధికార పార్టీలో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికల తర్వాత వలసల పర్వం మరింత రెట్టింపు కానుందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా చేస్తున్న ప్రకటనలు టీ పాలిటిక్స్‌లో మంట పుట్టిస్తున్నాయి. టీఆర్ఎస్‌లోని కొంతమంది ఎంపీలతో పాటు ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రులు, మంత్రుల, కుమారులు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, మునుగోడు ఫలితాల తర్వాత తమ పార్టీలో చేరుతారంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘనందన్ రావు మునుగోడు ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల రాజశేఖర్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే తాము పార్టీ మారడం లేదని వారిద్దరు బయటకు క్లారిటీ ఇచ్చినా.. లోలోపల రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 31న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడులో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోని పలవురు కీలక నేతలు కాషాయ తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారం నడుస్తోంది. బూర నర్సయ్యగౌడ్ ను కూడా సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా బీజేపీ నేతలు ఆకర్షించారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ లోని చాలామంది నేతలు తమతో మాట్లాుడుతున్నారని, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తారనే భయంతో ఇతర ఫోన్ల నుంచి తమతో మాట్లాడుతున్నారని రఘునందన్ రావు కామెంట్లు చేశారు. దీంతో బూర నర్సయ్యగౌడ్ విషయంలో అమలు చేసిన సీక్రెట్ ఆపరేషన్ తరహాలో బీజేపీలో చాపకింద నీరులా టీఆర్ఎస్ లో నేతలకు టచ్ లో వెళుతుందనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. బీజేపీ నేతలను టీఆర్ఎస్ చేర్చుకుంటున్న తరుణంలో కాషాయదళం ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెట్టింది. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -