Bandi Sanjay: టార్గెట్ రేవంత్ రెడ్డి.. బండి పాదయాత్రలో బీజేపీ భారీ స్కెచ్

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. అందుకు తగ్గట్లు ఇప్పటినుంచే కసరత్తు చేస్తోంది. అందివచ్చిన అవకాశాన్నింటినీ ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ ను దాదాపుగా దెబ్బతీసింది. టీఆర్ఎస్ ని టార్గెట్ చేయడం వల్ల టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే రాష్ట్రం రాజకీయం మారిపోయింది. కాంగ్రెస్ ను సైడ్ చేయడం ద్వారా ఆ పార్టీ రేసులో లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని టాక్ ఇప్పటికే ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు చూస్తే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే రాజకీయాలు నడుస్తున్నాయి. తమ ప్రత్యర్ధి బీజేపీనే అని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంతో పాటు దేశంలోనూ బీజేపీని ఎదర్కొనేందుకు సిద్దమవుతున్నాయి.

అయితే రేవంత్ రెడ్డి బలమైన నేత కావడంతో ఆయనను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది. అందకే రేవంత్ నియోజకవర్గంలోనే ఆయనకు చెక్ పెట్టాలని చూస్తోంది. బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర చూస్తే ఇదే చర్చ జరుగుతోంది. రేవంత్ ను బీజేపీ టార్గెట్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర దాదాపు మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనే ఎక్కువ జరగనుంది. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో నాలుగో విడత పాదయాత్ర ఎక్కవ రోజులు ఉండటం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

బండి నాలుగో విడత పాదయాత్ర మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో సోమవారం ప్రారంభం అయింది. పెద్ద అంబర్ పేట వరకు ఈ పాదయాత్ర జరగనుంది. 10 రోజుల పాటు 115 కిలోమీటర్లు సాగనుంది. గాజులరామారం చిత్తరామ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ీఈ పాదయాత్రను ప్రారంభించారు.

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రాంలీల మైదానంలో ప్రారంభ సబ నిర్వహించారు. కూల్బుల్లాపూర్, మాల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్బహీంపట్నం, కూకట్ పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెట్ నియోజకకవర్గాల్లో నాులుగో విడత పాదయాత్ర ప్రజాసంగ్రామ పాదయాత్ర జరగనుంది. అంబర్ పేటలో నాలుగో విడత పాదయాత్ర ముగియనుంది. ముగింపు సభకు అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యే అవకాశముంది.

రేవంత్ రెడ్డి నియోజకవర్గంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లోనే ఈ పాదయాత్ర జరుగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక కార్పొరేట్లను గెలుచుకుని విజయం సాధించింది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్ల కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలో బీజేపీ కాస్త బలంగానే ఉంది. అందుకే నాలుగో విడత పాదయాత్ర మరింత కలిసి వస్తుందని కాషాయ పార్టీలు వర్గాలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా మిగతా పార్టీలను కూడా దెబ్బతీయవచ్చని చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -