BJP: బీజేపీ కూటమికి బలం అవుతుందా.. బలహీనత అవుతుందా.. ఇంత దారుణమైన పరిస్థితులా?

BJP:  భారతదేశంలో బీజేపీ కి ఎంత బలం ఉన్నా తెలుగు రాష్ట్రాల వద్దకు వచ్చేసరికి బీజేపీ బలం ఎందుకు పనికిరాదు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ఎక్కువ మద్దతు లేకపోవడంతో బీజేపీ తెలివిగా వాళ్ల బలాన్ని రెట్టింపు చేసుకుంటూ టీడీపీ, వైయస్సార్సీపీ, జనసేన వంటి పార్టీలలో ఉన్న బలహీనతల మీద దృష్టి పెట్టి పాలిటిక్స్ లో చదరంగం ఆడుతున్నారు. అయితే ఎన్నాళ్లు శకుని పాత్ర పోషించిన వైసీపీ స్థానంలోకి చేరిన టిడిపి జనసేన పార్టీలు ఇప్పుడు జరుగుతున్న కాజా పరిణామాలు దృష్ట్యా తాము శకుని స్థానంలో ఉన్నాము లేక బంటు స్థానంలో ఉన్నామో తెలియని అయోమయంలో ఉన్నారు.

కిందటి సారీ ఎన్నికల అప్పుడు వైఎస్ఆర్సీపీ కి తోడుగా ఉండి టీడీపీని, జనసేనని తొక్కించేసి వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకున్నారు అంటూ బీజేపీ మీద ఎన్నో ప్రచారాలు వచ్చాయి. మరి ఈ సంవత్సరం బీజేపీ, టీడీపీ వైపు షిఫ్ట్ అవుతున్నట్టు ఉంది. టీడీపీ, జనసేన లో వైఎస్ ర్సీపీ మీద గెలవడానికి బీజేపీ తో చేతులు కలపగా దానికోసం వాళ్ళ అభ్యర్థులతో ఎన్నో త్యాగాలు చేయించారు.

ప్రజలలో బీజేపీ దగ్గర ఉన్న పేరుని మార్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదంతా చేస్తుంది టీడీపీ,జనసేన ను గెలిపించడానికా, లేకపోతే సైలెంట్ గా మళ్లీ వైఎస్సార్సీపీ నే గెలిపించే ప్రయత్నంలో వీళ్ళని ఓడించడానికి వాళ్లతో చేరుతున్నారా అంటూ కొత్త కొత్త అనుమానాలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు వస్తున్నాయి. 2019లో జరిగిన పొలిటికల్ పన్నాగాలు అన్నీ ఇప్పుడు మళ్లీ పునరావృత్తం అవుతున్నాయి.

ఇప్పటికే వాలంటీర్ల తో వైసీపీ మొదలుపెట్టిన పిన్షన్ల పంచాయితీ ఒక పక్క, జగన్ పై జరిగిన దాడిలో టీడీపీ నేతల ప్రమేయం ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం మరోపక్క, వ్యవస్థలో ఉన్న ఉన్నతాధికారుల అండ ప్రభుత్వ పెద్దలకు పుష్కలంగా ఉండడం ఇవన్నీ కూటమి పార్టీలను ఇరుకున పెడుతున్న అంశాలు. దీనికి తోడు మోడీ చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు కూడా కూటమిని బలహీన పరిచే సంఘటనలే కావడంతో బీజేపీ కూటమికి బలమా లేకపోతే బలహీనతా? అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -