MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన హై కమాండ్.. ఎందుకంటే?

MLA Raja Singh: భారతీయ జనతా పార్టీ తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విధంగా హై కమాన్ అతనిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆర్డర్స్ జారీ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.ఈ విధంగా హై కమాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…గత కొద్దిరోజులుగా రాజాసింగ్ ప్రవర్తన వ్యవహార శైలి పార్టీ కార్యక్రమాలకు విరుద్ధంగా ఉండటమే అందుకు కారణమని తెలుస్తుంది.

రాజా సింగ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో పార్టీకి విరుద్ధంగా ఉందని తెలియడంతో ఎంతోమంది ఇతని వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేశారు.ఈ విధంగా ఈయన గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చిన అనంతరం హై కమాండ్ ఈయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ విధంగా ఈయన వ్యవహార శైలి కారణంగా తాను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు హై కమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం సెప్టెంబర్ 2లోగా తాను వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.ఆయనని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదనే విషయం గురించి ఆయన వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆయనకు గడువు తేదీని ప్రకటించింది.

భాజాపా ప్రభుత్వం ఈయనని ఎమ్మెల్యేగా, పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా,బీజేఎల్పీ పోస్ట్ నుంచి కూడా రాజాసింగ్ ను అధిష్టానం తొలగించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.ఇలా ఈయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా పార్టీ వర్గాలలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -