BJP: హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అగ్రనేతలు.. ఈ సారి ఎందుకో తెలుసా?

BJP: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహరచనలు చేస్తోంది. ఇప్పటినుంచే క్యాడర్, నేతలను యాక్టివ్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కేసీఆర్ ను గెద్దె దించాలనే ఆలోచనలో బీజేపీ ఇప్పటినుంచే కసరత్తులు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో పావులు కదుపుతోన్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

 

త్వరలో మరోసారి జాతీయ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లోని అన్నోజిగూ ఆర్వీకే కేంద్రంలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణ తరగతుల కోసం జాతీయ స్థాయి అగ్రనేతలు రానున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఇతర పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ శిక్షణ తరగతుల ద్వారా పార్టీ క్యాడర్ కు పార్టీ సిద్దాంతాలతో పాటు, ప్రజా సమస్యలను గుర్తించడం, ఇతర అంశాలను తెలపనున్నారు.

 

ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. జాతీయ నేతలు గంటపాటు పార్టీ కార్యకర్తలు, నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. మూడు రోజుల పాటు జాతీయ నేతలు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు. పార్టీ బలపేతం, సంస్థాగత నిర్మాణంపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో బీజేపీ క్యాడర్‌లో జోష్ నెలకొంది. ఇప్పుడు జాతీయ నేతల రాకతో ఆ జోష్ కొనసాగనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు, మునుగోడు ఉపఎన్నిక సమయంలో జాతీయ నేతలు తెలంగాణకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ సగం మంది జాతీయ నేతలు తెలంగాణకు వస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -