BJP: ఏపీ నేతలతో బీజేపీ మైండ్ గేమ్.. మాటల్తో ముంచేస్తుందా?

BJP:దేశంలోనే ఏపీ రాజకీయాలు చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ బీజేపీకి 2 శాతం ఓట్లు కూడా లేవు. కానీ, మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ జేబులోనే ఉంటారు. 25 ఎంపీలు గెలవడం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయాలి? ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి? ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలి? విపక్షాలకు ఎన్ని కౌంటర్లు వేయాలి? కానీ, చెమట చుక్కు కూడా చిందించకుండా బీజేపీ 25 స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి న్యాయం జరగలేదని అడపదడపా అంటూనే ఉంటారు. కానీ, న్యాయం చేయాల్సిన కేంద్రాన్ని మాత్రం వైసీపీ కానీ, టీడీపీ, జనసేన కానీ ప్రశ్నించవు. పైగా మూకుమ్మడిగా 25 మంది ఎంపీలు కూడా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లుకు మద్దతు ఇస్తారు. గల్లీలో వైసీపీని టీడీపీ.. టీడీపీని వైసీపీ విమర్శించుకుంటాయి.

ప్రత్యేకహోదా తేవడంలో టీడీపీ విఫలమైందని 2014 నుంచి 2019 వరకూ జగన్ ఊరూరా ప్రచారం చేశారు. 2019 తర్వాత జగన్ కేంద్రం మెడలు ఎందుకు వంచలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా కావాలి.. విభజన హామీలు నెరవేర్చాలని రెండు పార్టీలు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించిన రోజు లేదు. అవినీతి కేసులకు భయపడి జగన్ కేంద్రం దగ్గర మాట్లాడటం లేదని టీడీపీ విమర్శిస్తోంది. కానీ, సహజంగా డేరింగ్ డెషిసన్స్ తీసుకోవడానికి ఆలోకచించే చంద్రబాబు.. బీజేపీతో పెట్టుకోవడం మంచిది కాదని సైలంట్ గా ఉంటున్నారు. ఎవరి కారణాలు వారికున్నా… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రెండు పార్టీలు కూడా చిత్తశుద్దిని ప్రదర్శించడంలేదు. దీన్నే కేంద్ర బీజేపీ అలుసుగా తీసుకుంటోంది. వారికి కావాల్సింది 25 మంది ఎంపీలు. దాని కోసం ఏం చేయడానికి అయినా సిద్దమే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓ వైపు వైసీపీతో సత్సంబంధాల కొనసాగిస్తూనే.. టీడీపీతో పొత్తుకు సిద్దమైయ్యారు. టీడీపీ ఎన్డీఏలో చేరినా.. 2014 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ ఎంపీలు కేంద్ర బీజేపీకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటారని ప్రచారం జరుగుతోంది.

 

కేంద్రంలో బీజేపీకి అత్యధిక మెజార్టీతో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాతో భేటీ అయ్యారు. ఎన్డీఏలో కలిసేందుకు చర్చలు జరిపారు. నిజానికి ఏపీలో టీడీపీ, జనసేన కూటమికి గెలుపునకు తిరిగిలేని పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీతో జత కట్టాల్సిన అవసరం లేదు. కానీ, రేపు ఎన్నికల తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో ఇబ్బంది లేకుండా ఇప్పుడే పొత్తు పెట్టుకోవడం మంచిదని ఎన్డీఏలో చేరడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దాదాపు బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమని తెలిసిన తర్వాత కూడా జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. అదే పెద్ద అలుసని అటు ఢిల్లీ వర్గాలతో పాటు.. ఏపీలో కూడా చర్చ జరుగుతోంది. పోటీ పడి ఒకరితర్వాత ఒకరు ఢిల్లీ వెళ్లి మోడీని, అమిత్ షాని కలవడంతో ఏపీ నాయకులను బీజేపీ అలుసుగా చూస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నోటాకు ఉన్న ఓట్లు కూడా బీజేపీకి ఏపీలో లేవు. అలాంటప్పుడు.. అమిత్ షా, మోడీ.. ఏపీలో పొత్తు కోసం పాకులాడాలని కానీ.. వారికి ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు, జగన్ ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా చేయడం వలనే ఏపీ తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా.. బీజేపీ ఏపీని నేతలను ఆటాడిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -