YCP-BJP: వైసీపీకి బీజేపీ సపోర్ట్ ఉండట.. జగన్ దారి గోదారేనా?

YCP-BJP: ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి.జగన్ ఢిల్లీ పర్యటన వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తరువాత ఇలాంటి ఘటన జరగడంతో వైసిపి నేతలు షాక్ లో ఉన్నారు. ఈనెల 18వ తేదీ ఢిల్లీలోని అశోకా హోటల్లో బిజెపి మిత్ర పక్షాలు (ఎన్డీ ఏ) సమావేశం జరగనుంది అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని టీడీపీకి ఆహ్వానం అందడం విశేషం.

ఇలా ఈ ఎన్డీ ఏ సమావేశాలలో పాల్గొనడం కోసం తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందడంతో వైసిపి నేతలు షాక్ లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బిజెపి తెలుగుదేశం ప్రభుత్వంతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది ఎన్ని రోజులు బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ఎదురు చూశారు ఇప్పుడు స్వయంగా వారితో ఆహ్వానించడంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలుస్తోంది.

 

ఇక ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే వచ్చే ఎన్నికలలో బిజెపి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు కలిసి పోటీకి సిద్ధమవుతున్నాయని దీంతో వైసిపి ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఈ మూడు పార్టీలకు ఎన్నికల పోటీలో దిగి జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలన్న ఉద్దేశంలోనే ఇలా పొత్తుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.

 

ఇకపోతే ప్రస్తుతం కేంద్ర కేబినెట్ విస్తరణ చేపడుతున్న నేపథ్యంలో ఎన్డీ ఏ తెలుగుదేశం పార్టీని కనుక విలీనం చేసుకుంటే ఈ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి వారిలో గల్లా జయదేవ్ కుమార్,కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వీరిలో కేశినేని నాని పార్టీ అధిష్టానంతో గొడవల్లో ఉన్న నేపథ్యంలో ఈయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు అయితే మిగతా ఇద్దరిలో ఎవరికో ఒకరికి కేంద్ర మంత్రి పదవి రావడం ఖాయమని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -