Pawan – Jagan: జగన్ చేతికి రక్తం మరకలు.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

Pawan – Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల మధ్య మాటల ఘర్షణ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ మీద టీడీపీ, జనసేన మాటల యుద్ధం చేస్తుంది. వైసీపీ కూడా ఈ పార్టీలపై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా పవన్ మరోసారి జగన్ పై మండిపడినట్లు కనిపించాడు. తాజాగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో జనసేన వారాహి యాత్రను ప్రారంభించడానికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కత్తిపూడి లో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనసేన ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని.. ప్రజలకు అండగా ఉంటుందని అన్నాడు. ఈ పదేళ్లలో గెలుపు ఓటములను పక్కకు పెడితే.. ఒక పార్టీని స్థాపించి దశాబ్ద కాలంగా నడిపించడం సామాన్య విషయం కాదని అన్నాడు. జనసేన ను ఎంతసేపు నువ్వు విడిగా రా.. విడిగా రా.. అని వైసీపీ నాయకులు అంటున్నారు.

నేను విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలే.. ఆరోజు వచ్చినప్పుడు మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెబుతా.. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అంటూ సవాల్ విసిరాడు. ఇక అందుకోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తా.. ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తా అని అన్నాడు. ఇక పార్టీని 10,000 కోట్లు లక్షల కోట్లు ఉన్న వారి పార్టీల నడపలేం అంటూ.. మీలా గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉంటే నడపగలం అని అన్నాడు.

ఇక తనను అణచివేస్తే సగటు మనిషికి వచ్చినంత కోపం వచ్చిందని.. ఆ ఆవేదనతో, ఆలోచనతో, ఆవేశంతో అన్ని వదులుకొని.. అన్నిటికీ సిద్ధపడే మీ భవిష్యత్తు కోసం.. మీ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నాడు. ఇక బీజేపీ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటే రాజు పడే వ్యక్తిని కాదు అంటూ.. ఈ ముఖ్యమంత్రిల నామీద కేసులు తీసేయండి.. ఆంధ్రప్రదేశ్ ను తగలబెట్టండని చెప్పే వ్యక్తిని కాదు అని అన్నాడు.

ఇక ఈసారి జనసేనకు అండగా నిలబడమని అర్ధించడానికి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాను అంటూ.. ఇప్పటికే పదేళ్లు దెబ్బ తిన్నాను అంటూ.. ఆశీర్వదించండి అంటూ కోరాడు. 151 మంది ఎమ్మెల్యేలు, ఉభయ సభలు 30 మంది ఎంపీలను పెట్టుకొని ఒక్క సీటు లేని మనల్ని వైకాపా నాయకులు, మంత్రివర్గం టార్గెట్ చేస్తుంటే మన పార్టీ ఎంత బలమైందో అర్థం చేసుకోవాలి అని అన్నాడు.

చేతులకు రక్తం మరకలు అంటించుకున్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా అవసరమా అని గట్టిగా ప్రశ్నించాడు. సొంత చిన్నాన్నని చంపిన వారిని వెనకేసుకొస్తున్నారని జగన్ ప్రభుత్వం గురించి మరికొన్ని వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డాడు. అంతేకాకుండా సినిమా టికెట్ల విషయం గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇక జగన్ చేసిన అన్యాయాల గురించి కూడా మాట్లాడి ప్రజలలో అవగాహన కల్పించే విధంగా చేశాడు పవన్. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -