Bollywood: బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు.. అలాంటి భర్త కావాలంటూ?

Bollywood: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా గురించి మనందరికీ తెలిసిందే. షెర్లిన్ చోప్రా సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా ఎక్కువగా పాపులారిటీని తెచ్చుకుందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు విషయంలో నటి రాఖీ సావంత్ తో పాటు ఈమె పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిన సంగతి మన అందరికీ తెలిసిందే. కాగా షెర్లిన్ చోప్రా దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్, రెడ్ స్వస్తిక్, వజా తుమ్ హో లాంటి సినిమాలలో నటించి బాలీవుడ్‌లో మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది నటి షెర్లిన్ చోప్రా.

దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకి సరైన అవకాశాలు రాలేదు. దాంతో ఈమె కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాల్లో ఎక్కువగా నటించి పాపులారిటీ సంపాదించుకుంది. ఎక్కువగా బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా తన పెళ్లి విషయం పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది షెర్లిన్ చోప్రా. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నాకు భర్త కావాలి.

కాని అతను మిలియనీర్ అయ్యి ఉండాలి. అతను ఒకే మహిళను ఇష్టపడే వ్యక్తి అయ్యి ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు.

 

అతను నిజాయితీగా, మంచి మనసుతో ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిని నా కోసం భర్తగా వెతికిపెట్టమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది షెర్లిన్ చోప్రా. అనంతరం సిని సీరియర్ గురించి మాట్లాడుతూ.. నన్ను ఇండస్ట్రీ మొత్తం రిజెక్ట్ చేసింది. మహేష్‌ భట్, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు నన్ను తిరస్కరించారు. కానీ, ఎందుకనే కారణాలు తెలియవు. కాని నాతో నీలో విషయం లేదు. నువ్వు సాల్టీగా లేవని అనేవారు అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -