Bollywood : రిషబ్ శెట్టిపై మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్.. ఏమైందంటే?

Bollywood: ఎవరి భాషపై వారికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ప్రాంతీయ అభిమానం, సంప్రదాయాలపై స్థానికులు కట్టుబడి ఉంటారు. ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇలాంటి భేధాలు చాలా వరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలో డబ్ చేస్తుంటారు. అలాగే కన్నడ, హిందీ సినిమాలను కూడా ఇతర భాషల్లో విడుదల చేయడం చూస్తున్నాం. ఇటీవల థియేటర్లలో విడుదలైన కన్నడ సినిమా ‘కాంతార’ బిగ్గేస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. థియేటర్ల వద్ద కనక వర్షం కురిపించింది. అలాంటి మూవీకి డైరెక్టర్ కమ్ హీరోగా వ్యవహరించిన రిషబ్ శెట్టి ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నాడు. భాషాభిమానంతో అతిగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాడు.

 

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్నడ హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కాంతార’. మొదటగా కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టింది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. కన్నడలో రూ.100 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.40 కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే హిందీ వెర్షన్‌లో విడుదలైన ఈ సినిమా కూడా మంచి టాక్‌తో దూసుకెళ్లింది. బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపారు. సినిమా సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ రిషబ్ శెట్టి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రిషబ్ శెట్టి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

 

 

రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఉత్తరాది ప్రేక్షకులు రిషబ్ శెట్టి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ‘హిందీ సినిమాల్లో నటించడం లేదా డైరెక్షన్ కానీ చేయను. ఎందుకంటే మొదటగా కన్నడ ప్రజలే ‘కాంతార’ సినిమాను ఆదరించారు. అందుకే తనకు ఇప్పుడు ఓ స్టేజ్ క్రియేట్ అయింది. కేవలం ఒక్క సినిమా హిట్ అయిన మాత్రానా నా కుటుంబాన్ని, నా స్నేహితులను మార్చుకోలేను. కన్నడ సినిమాలంటేనే నాకు ఇష్టం.’ అని పేర్కొన్నాడు. దీంతో రిషబ్ శెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు తీయాలని అనుకున్నప్పుడు హిందీలో మూవీని ఎందుకు రిలీజ్ చేశావని మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -