Hanuman: హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టి మిస్ చేసుకున్న రోల్ ఇదేనా?

Hanuman: చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో నిలిచిన హనుమన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా రోజురోజుకీ వసూళ్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతుంది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. అమెరికాలో కూడా మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ నటనలో జీవించేసారని చెప్పాలి.

 

ఇక ఇందులో విభీషణుడి పాత్రని సముద్రఖని వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందు ఆ పాత్ర కోసం కన్నడ నటుడు రిషబ్ శెట్టి ని అనుకున్నాడంట ప్రశాంత్ వర్మ. అయితే అప్పటికే కాంతారా సినిమా పనులలో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. చాలా బిజీగా ఉండటం వలన ఆ సినిమా పనులను పక్కనపెట్టి హనుమాన్ సినిమాలో నటించలేకపోతున్నందుకు రిషిబ్ సెట్టి సైతం చాలా బాధపడ్డాడట.

అంతేకాకుండా ప్రశాంత్ వర్మ తీయబోయే 12 సినిమాలలో ఏదో ఒక సినిమాలో కచ్చితంగా నటిస్తానని మాట కూడా ఇచ్చారంట. హనుమాన్ సినిమాలో విభీషణుడు పాత్రని సముద్రఖని చాలా బాగా చేశారు. కానీ ఆ పాత్ర రిషబ్ సెట్టి చేసి ఉంటే ఇంపాక్ట్ మరింత బాగా ఉండేదని అంటున్నారు ప్రేక్షకులు. అయితే హనుమాన్ మూవీ పై ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆ లిస్టులో రిషబ్ శెట్టి కూడా చేరారు.

 

తాజాగా హనుమాన్ సినిమా చూసిన ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జను పొగడ్తలతో ముంచెత్తారు. హనుమాన్ సినిమాను అభినందించే లిస్టులో చేరటం సంతోషంగా ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టోరీ చెప్పే విధానం అద్భుతంగా ఉంది తేజ సజ్జ నటన సైతం చాలా బాగుంది. ఆయన నటన చాలా కాలం వరకు ప్రేక్షకులకు గుర్తుంటుంది అని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. రిషబ్ శెట్టి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -