Pawan: బూమ్ బూమ్ కు ఎక్కువ ఆంధ్రా గోల్డ్ కు తక్కువ.. వాలంటీర్లపై పవన్ అలా అన్నారా?

Pawan: ప్రస్తుతం ఏపీలో జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై జగన్ పై అలాగే వాలంటరీ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను తగలబెట్టడం చెప్పులతో కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. పవన్‌ కల్యాణ్ చేపట్టిన రెండో విడత వారాహి యాత్ర తాడేపల్లిగూడెం చేరుకుంది.

 

ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రమాణస్వీకారం రోజు జగన్‌ నన్ను ఆహ్వానించారు. ప్రత్యర్థులుగా ఉన్నందున రాలేనని ఆరోజు చెప్పాను. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటానని చెప్పాను. జగన్‌ ను వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ విమర్శించలేదు. మేం ఎప్పుడూ సీఎం జగన్‌ సతీమణిని వివాదాల్లోకి లాగలేదు. కానీ, జగన్‌ నీకు సంస్కారం లేదు. సీఎంగా ఉండే అర్హత లేదు. వాలంటీరు అంటే జీతం ఆశించకుండా పనిచేసే వ్యక్తి. వాలంటీర్ల కేంద్రం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ లో ఉంది. ఏపీ డేటా మొత్తం నానక్‌రామ్‌గూడలోనే ఉంది. నానక్‌రామ్‌గూడలోని ఒక ఏజెన్సీకి ఏపీ ప్రజల సమాచారం ఎందుకు ఇచ్చారో జగన్‌ సమాధానం చెప్పాలి.

అందులో పనిచేస్తున్న 700 మందికి ఎవరు జీతాలు ఇస్తున్నారు? వాలంటీర్లపై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. వ్యవస్థ పనితీరు గురించే మాట్లాడుతున్నాను. ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో కొందరు వాలంటీర్లు పట్టుబడ్డారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారు. రెడ్‌ క్రాస్‌కు దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్‌ హెడ్‌గా ఉంటారు. జగన్‌ నీ వాలంటీరు వ్యవస్థకు ఎవరు అధిపతి? వాలంటీర్లు అనేక చోట్ల ప్రజలను వేధిస్తున్నారు. తిరుపతిలో ఎర్రచందనం రవాణాలో వాలంటీర్లు పట్టుబడ్డారు. నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదు. మా జగనన్న నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చేశాడు. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో ఉన్నారు. జనవాణి ప్రారంభించేందుకు వాలంటీర్లే కారణం. వాలంటీరు వేతనం రోజుకు రూ.164.38 అంటే ఉపాధి హామీ కూలీ వేతనం కంటే తక్కువే. వాలంటీరు జీతం కూడా తక్కువ అంటూ జగన్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ఆడబిడ్డల మానప్రాణాల సంరక్షణే జనసేన విధానం. మహిళలు కోరుకున్న చోట మద్య నిషేధం అమలు చేస్తాం. మద్యం వల్ల మహిళలకు ఇబ్బంది ఉండదని హామీ ఇస్తున్నాను అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సరిగ్గా చదువుకోలేదు కాబట్టే వాలంటీరు అంటే ఏంటో జగన్‌కు తెలీదు. స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చావు. నీకేం తెలుస్తుంది వాలంటీరు అంటే పోలవరం కట్టలేరు. కనీసం ఎర్రకాలువ గండ్లు కూడా పూడ్చలేరా? రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వరు. ఉపాధి కల్పించరు. ఉపాధి లేకుంటే యువత ఎక్కడికి వెళ్తారు? మీలా దోచుకున్న డబ్బు లేదు. మేం ఇక్కడే బతకాలి. అంగన్వాడీలకు జీతం పెంచుతామని మీరే హామీ ఇచ్చారు. తెలంగాణ కంటే ఎక్కువే ఇస్తామని మీరే చెప్పారు అంటూ పవన్ కళ్యాణ్ నిసీఎం జగన్ ని ప్రశ్నించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -