Botsa Satyanarayana: ఏపీకి రాజధాని లేకపోవడానికి బాబు కారణమట.. విమర్శలకు హద్దుండాలి బొత్సా?

Botsa Satyanarayana:  వైసీపీ నేతలకు ఓడిపోతామన్న భయం పట్టుకున్నట్టు ఉంది. అందుకే ఆ భయంలో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. ఒకరు ఒక తప్పును చేస్తే.. ఆ తప్పును కవర్ చేయడానికి రంగంలోకి దిగుతున్న మేధావులు మరో తప్పు చేస్తున్నారు. ఇలా తప్పులు మీద తప్పులు చేసి పరువులు తీసుకుంటున్నారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. రెండు రోజుల క్రితం వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ వైసీపీకి నష్టం చేసేలా ఉంటే.. దాన్ని కవర్ చేయడానికి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ ఆ పార్టీ పరువు తీసేలా ఉన్నాయి.

వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన పెద్దల సభలో తన కర్తవ్యం ఏంటో చెప్పారు. ఉమ్మడిరాజధానిగా హైదరాబాద్ ఉంటే బాగుటుందని అన్నారు. అలా కామన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఉండేలా తన వాయిస్ రాజ్యసభలో వినిపిస్తానని చెప్పారు. ఇది పెద్ద ఎన్నికల స్టంట్ లా ఉందని అర్థం చేసుకున్నారు జనం. మూడు రాజధానుల పేరుతో ఉన్న రాజధానిని లేకుండా చేసిన వైసీపీ ఇప్పుడు ఉమ్మడి రాజధాని అనడం వెనక ఏందో ఉందని అనుకున్నారు.

ఏపీకి రాజధాని లేదని ప్రజల్లో అసహాన్ని గ్రహించిన వైసీపీ ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త రాగం ఎత్తుకుంటే.. రాజకీయంగా ప్రయోజనం ఉంటుదని ఆ పార్టీ భావించింది. అందుకే హైదరాబాద్ పేరు తెరపైకి తీసుకొని వచ్చింది. కానీ, మూడు రాజధానులు చేతకాకే కదా ఇప్పుడు కామన్ క్యాపిటల్ అంటున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. మూడు రాజధానుల పేరుతో అమరావతికి ఆనవాళ్లు లేకుండా చేశారు కదా అని ట్రోల్ చేశారు. ఈ నష్టాన్ని గ్రహించిన వైసీపీ అధిష్టానం మంత్రి బొత్సను రంగంలోకి దించింది. కానీ.. మాట్లాడాల్సిన దాని కంటే ఎక్కువ మాట్లాడేశారు మంత్రి బొత్స. ఇప్పుడు అవే వైసీపీ పరువును గంగలో కలిపేశాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

తప్పును సరిదిద్దుకోవాలని అనుకున్న రాజకీయ నాయకులు వక్రీకరణ పేరుతో కవర్ చేయడం సహజమే. అయితే, బొత్స అక్కడితో ఆగిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. దానిని కంటిన్యూ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడి వలనే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని అన్నారు మంత్రి బొత్స. ఉమ్మడి రాజధాని ఉండగా అమరావతి అంటూ ఏపీకి వచ్చేశారనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ చేశారు. దీంతో.. సోషల్ మీడియాలో పార్టీలకు అతీతంగా బొత్స వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఉమ్మడి రాజధాని తాత్కాకలికమేనని.. ఆ తర్వాత రాష్టానికి ఓ క్యాపిటల్ ఉండాలని గ్రహించిన చంద్రబాబు అమరావతి నిర్మాణం చేస్తే దాన్ని ద్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో ఉన్న రాజధానిని కూడా లేకుండా చేసి మళ్లీ చంద్రబాబుపై నిందలు వేయడం ఏంటని మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -