పెళ్లికి నిరకరించడంతో ప్రియురాలిని చంపేసిన ప్రియుడు!

ఇటీవల కాలంలో యువత తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ అన్న పేరుతో తల్లిదండ్రులకు తలవంపు తెచ్చే పనులు చేస్తున్నారు. మొదట స్నేహం అంటూ బంధాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత చేయకూడని పనులు అన్నీ చేసి ఒకరిని మరొకరు ప్రేమిస్తున్నట్టు నటించి ఆ ప్రేమికులిద్దరిలో ఎవరికి కావాల్సిన వారు దొరకగానే మోసాలకు పాల్పడుతున్నారు. మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా అటువంటి పనులు చేసే వారిలో మాత్రం మార్పు కలవడం లేదు. అంతేకాకుండా ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటూ నే ఒకరికి తెలియకుండా మరొకరు ఇంకొకరితో ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిలు అయితే ప్రేమించిన అబ్బాయిని కాదని పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోగా మరి కొందరు అలా మోసం చేసిన వారిని హత్య చేయడానికి సైతం వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలోని భాసోరి గ్రామంలో సీమా అనే యువతి ఉంది. ఆమె పొరుగింట్లో రాజేష్ కుమార్ అలియాస్ ఛోటూ అనే యువకుడు ఉండేవాడు. వారు ఇరుగుపొరుగు వారు కావడటంతో అప్పుడప్పుడు చూసుకునే వారు. రాజేష్ ఏ ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి తో మాట్లాడటం మొదలుపెట్టాడు. అలా వారిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అది కాస్తా స్నేహం, ప్రేమ వరకు దారి తీసింది.

అలా వారికీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు ఊరి బయటకి వెళ్లి ముచ్చట్లు పెట్టుకునేవారు. అలా కొన్ని నెలల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకున్న ఈ జంట వ్యవహారం ఇంట్లో తెలిసింది. రాజేష్ కు ఉద్యోగం లేకపోవడం వలన, యువతిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సీమా కుటుంబ సభ్యులు నిరాకరించారు. అంతేకాకుండా సీమాకు వేరే సంబంధం చూడటం మొదటలు పెట్టారు. సీమా కూడా పెళ్లి సంబంధాలకు సిద్దమైంది. ఈ విషయం తెలుసున్న రాజేష్ కోపంతో సీమా వద్దకు వెళ్ల తనను పెళ్లి చేసుకోవాని అడిగగా అందుకు ఆమె తిరస్కరించింది. ఇక ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న రాజేష్ అర్ధరాత్రి సమయంలో సీమా ఇంటికి వెళ్లి ఆమె నిద్రలో ఉండగా కత్తితో మెడపై ఫలితాలు కత్తితో పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సీమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -