Brahmastra:  బాయ్ కాట్ లు, బ్యాడ్ రివ్యూలను కొట్టి పారేసి వెళుతున్న బ్రహ్మాస్త్ర!

Brahmastra:  సినీప్రియులకు బ్రహ్మాస్త్ర సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హిందీ భాషా ఫాంటసీలో విడుదలైన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. దీనిని కరణ్ జోహార్, అపూర్వ మెహతా , నమిత్ మల్హోత్రా ముఖర్జీ లు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సినిమా విడుదల కాకముందు బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో హైలెట్ చేశారు.

అంతేకాకుండా పలు బి టౌన్ ప్రేక్షకులు బ్రహ్మాస్త్ర టీజర్ ని చూశాక బహుబలి ఆ బొక్క.. అనే రేంజ్ లో కామెంట్ లు పెట్టారు. ఇక ఈ మాటను టాలీవుడ్ ప్రేక్షకులు ఒక రేంజ్ లో కొట్టి పారేశారు. 18 కోట్లు కొల్ల గొట్టిన బాహుబలి సినిమాకి బ్రహ్మాస్త్ర సినిమాకి పోలిక ఉందా అని తెలుగు ప్రేక్షకులు ఘాటుగానే కామెంట్ల రూపంలో సమాధానం ఇచ్చారు. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు ముందు నుంచే బాయ్ కాట్ అనే పిలుపులు ఎదురయ్యాయి. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా విడుదలైంది.

ఇక సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు బ్యాడ్ రివ్యూలు స్టార్ట్ అయ్యాయి. అంతే కాకుండా థియేటర్ నుంచి బయటికి వచ్చిన సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమా యావరేజ్ అన్నట్లుగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు. ఇక ఈ బ్యాడ్ రివ్యూలకు, బాయ్ కాట్ పిలుపులు మరింత తోడయ్యాయి. మరి ఈ సినిమాకు ఈ విధంగా బాయ్ కాట్ పిలుపులు ఎదురైనప్పటికీ సినిమా మాత్రం వసూళ్ల విషయం లో బాగా దూసుకుపోతుంది.

ఒక వీకెండ్ లోనే ఈ సినిమా వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమాకి అంత బాగా రేటింగ్స్ కూడా రాలేదు. థియేటర్ లో నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకుడు కూడా ఈ సినిమాగురించి యావరేజ్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రేక్షకులు గ్రాఫిక్స్ తప్ప ఈ సినిమాలో స్టోరీ ఏమీ లేదు అని తెలుపుతున్నారు. కానీ ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి అసలు వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో ప్రస్తుతం ముందంజలోనే ఉంటున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -