Bro Movie: బ్రో సినిమాలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

Bro Movie: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించి మంచి ఫామ్ లో ఉన్నారు. తర్వాత ఆయన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అది ఈ నెల 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరు గా సాగుతున్నాయి. ఇదే సమయంలో సాయిధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియా మిత్రులు బ్రో సినిమాలో పొలిటికల్ పంచులు ఉంటాయా.. ఈ సినిమా ద్వారా వైసీపీని టార్గెట్ చేస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. అయితే అందుకు సాయిధరమ్ తేజ్ ఈ విధంగా చెప్పకు వచ్చాడు. ఈ సినిమాలో పొలిటికల్ పంచులు వేసేందుకు అవకాశం లేదు ఎందుకంటే ఈ నిమిషం బ్రతికితే చాలు అనే కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఇది ఇందులో నాకు తెలిసి అలాంటి డైలాగులు లేవు అని చెప్పుకొచ్చాడు.

 

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా మీ మామయ్యకి మీ మద్దతు తెలియజేస్తారా అని మరొక మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం గా మా మామయ్యకి నా మద్దతు అక్కర్లేదు ఆయనకి ప్రజల మద్దతు ఉంది వాళ్లే చూసుకుంటారు. అయినా మావయ్య కోరితే తప్పకుండా ప్రచారంలో పాల్గొంటాను అని చెప్పాడు. మరో మీడియా మిత్రుడు మీరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా మీ రాజకీయ రంగా ప్రవేశం ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

 

నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అయినా మా మామయ్య రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేకుండా రాజకీయాల్లోకి రావద్దని సలహా ఇచ్చారు.నాకే కాదు వైష్ణవి తేజ్ రామ్ చరణ్ తేజ్ వీళ్ళు ఎవరికీ కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు అయినా మా మామయ్య మా అవసరం ఉంది మా మద్దతు కావాలి అంటే మాత్రం ఆయన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అని చెప్పుకొచ్చాడు బ్రో సాయి ధరమ్ తేజ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -