Bro Movie: బ్రో మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ మరీ అంత దారుణంగా ఉన్నాయా?

Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టార్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వినోదయం సీతం అనే సినిమాని రీమేక్ చిత్రంగా తెరకెక్కించారు. ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి అనుగుణంగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్ట లేకపోయిందని చెప్పాలి.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాపై బజ్ ఏమాత్రం ఏర్పడలేదు. ఇక ఈ సినిమా ఆంధ్ర నైజాం ఏరియాలతో పాటు ఓవర్సీస్ లో కూడా చాలా లిమిటెడ్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం మూడు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలు మల్టీ ఫ్లెక్స్ లో రన్ అవుతుండడంతో ఆ సినిమాలను తీసి బ్రో సినిమాని వేయడానికి ఇష్టపడటం లేదు ఇక సింగిల్ థియేటర్లలో అయితే చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నటువంటి బేబీ సినిమా రన్ అవుతుంది.

 

ఇప్పటికీ ఈ సినిమా హౌస్ ఫుల్ తో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమాని తీసి పవన్ కళ్యాణ్ సినిమా వేయడానికి కూడా థియేటర్ ఓనర్స్ ఒప్పుకోవడం లేదు.దీంతో తప్పనిసరి పరిస్థితులలో బ్రో సినిమా చాలా లిమిటెడ్ గా విడుదలైందని చెప్పాలి పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే ఇలా లిమిటెడ్ థియేటర్లలో సినిమా విడుదల కావడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుంది. ఒక రీమేక్ సినిమా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం ఇదే మొదటిసారి.

 

ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చినప్పటికీ మొదటి రోజు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా కూడా ఇదే అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం భారీగా పడిపోయాయని తెలుస్తుంది. అయితే ఈ ఏరియాలో ఎంత కలెక్షన్స్ రాబట్టిందనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -