Kavitha – Avinash Reddy: కవితను అరెస్ట్ చేశారు కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదుగా.. వైసీపీ అంటే భయమా అంటూ?

Kavitha – Avinash Reddy: తెలంగాణలో కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితన ఈడీ అధికారులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ తీసుకొని వెళ్లి తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీస్ చేస్తున్నారు. అయితే, లిక్కర్ స్కాం బయటపడిన మూడేళ్ల తర్వాత కవితను అరెస్ట్ చేశారు. మరి ఈ మూడేళ్లు ఏం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఎప్పుడో అరెస్ట్ అయ్యారు. కానీ, కవితను అరెస్ట్ చేయడానికి మూడేళ్లు ఎందుకు సమయం పట్టింది అనే ప్రశ్నలకు తెలంగాణ ప్రజలకు తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ అరెస్ట్ ఆలస్యం అవ్వడం వలన బీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా తెలంగాణలో ఎంత నష్టపోయిందో కూడా అందరికీ తెలిసిందే.

ఎమ్మెల్సీ కవిత కేసుతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. కాంగ్రెస్ కు ఎన్నికల్లో అస్త్రాన్ని ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. మొత్తానికి ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు. దీంతో.. గతంలో వచ్చిన ప్రశ్నలకు ఇప్పుడు క్రెడిబిలిటీ ఉండదు. కానీ.. కవిత అరెస్ట్ తర్వాత కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడేళ్ల క్రితం కేసులో కవిత అరెస్ట్ అయితే.. ఐదేళ్ల క్రితం జరిగిన హత్యకేసులో అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కవిత ఇంటికి వెళ్లి ఆమెను ఈడీ అరెస్ట్ చేశారు. కానీ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు మాత్రం వెనుదిరగాల్సి వచ్చింది. పులివెందులలో అవినాష్ రెడ్డి అనుచరులు ఎదురు తిరుగుతారని అరెస్ట్ చేయలేకపోవచ్చు. కనీసం విచారణ కోసం హైదరాబాద్ వస్తున్నపుడు అయినా అరెస్ట్ చేయాలి కదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దేశ రాజకీయాలను శాసించడానికి ప్రయత్నించిన కేసీఆర్ కుమార్తెను తన ఇంటి దగ్గరే అధికారులు అరెస్ట్ చేశారు. ఓ ఎంపీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేయలేరా? లేదంటే అరెస్ట్ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్నలు వినిస్తున్నాయి. అయితే, ఈ ప్రశ్నలకు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత సమాధానం చెప్పారు. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని.. ఆయన్ని కాపాడుతున్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అని తేల్చారు. అంతేకాదు.. వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రక్తపు పునాదులపై నిర్మించిన ఈ ప్రభుత్వం కూలిపోక తప్పదని వారు చెప్పారు. జగన్ ను సొంత చెల్లెల్లే నిందిస్తున్నపుడు.. కేంద్రం ఎందుకు వెనకేసుకొని వస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

3 వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంలో ఢిల్లీ మంత్రులు వరుస పెట్టి జైలుకు వెళ్తున్నారు. రేపో మాపో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని జోరుగా చర్చ జరుగుతోంది. కానీ.. లక్షల కోట్ల అవినీతి మరకలు ఉన్న ఓ వ్యక్తి దర్జాగా ప్రజల్లో తిరుగుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా.. తన అంత నీతిమంతుడు ఎవరూ లేదని చెప్పుకు తిరుగుతున్నారు. అంతేకాదు.. ఆయన మరికొంతమంది హంతకులను కాపాడుతున్నారు. అంటే విచిత్రంగా అనిపిస్తుంది. మరి కేంద్రం పెద్దలు ఇలాంటి వారిని వెనకేసుకొని వస్తారు? న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్న వివేకా కుమార్తెకు న్యాయం జరుగుతుందా?

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -