BRS Leader KTR: నోటీసులిస్తే మీడియా జంకుతుందా కేటీఆర్.. తప్పు చేసిన వాళ్లే భయపడతారుగా!

BRS Leader KTR: గడిచిన పదేళ్ల పాటు ఏకచత్రాధిపత్య వహించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కితే చాలు అనుకున్న నేతలు.. ఇప్పుడు టికెట్ ఇస్తే వద్దని అంటున్నారు. రాజకీయంగా పార్టీ నాలుగు నెలల్లోనే వీక్ అయిపోయింది. గతంతో ఎప్పుడూ లేని అంత సంక్షోభంలో బీఆర్ఎస్ కూరుకుపోయింది. కేకే, కడియం లాంటి వారంతా పార్టీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీ అభ్యర్థులు కూడా టికెట్ అవసరం లేదని ప్రకటిస్తూ పక్క చూపులు చూస్తున్నారు. ఓ వైపు రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని పలు కేసులు చుట్టూ ముడుతున్నాయి.

లిక్కర్ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారని జోరుగా చర్చ నడుస్తోంది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంచనల వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో కవిత, కేటీఆర్ త్వరలో అరెస్ట్ అవుతారని అన్నారు. అప్పటి నుంచి లిక్కర్ కేసు కేటీఆర్ పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలకు తెగబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ కేసు కుదిపేస్తుంది. కేటీఆర్ డైరెక్షన్‌లోనే ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విచారణ పీక్స్ లో ఉంది. చాలా మంది అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. రేపో మాపో కేటీఆర్ కు కూడా నోటీసులు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

దీనిపై పలు చానళ్లు వారికి తోచిన విశ్లేషణలు చేస్తున్నాయి. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా చానెళ్లకు నోటీసులు పంపించారు. గతంలో కూడా కేసీఆర్ తమకు సొంత యూట్యూబ్ చానెళ్ల లేవని.. అందుకే ఓడిపోయామని చెప్పారు. విపక్షాలకు వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయని అన్నారు. విపక్షాలకు కొమ్ముకాస్తున్న ఆయా చానళ్లు తమపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. 10 యూట్యూబ్, మెయిన్ చానెళ్లకు నోటీసులు పంపించారు. మరోసారి ఇదే రిపీట్ చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. చానెళ్లు చేసేవి ఆరోపణలు, అందులో నిజం లేదనుకుంటే భయం ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వస్తున్న ఆరోపణలపై విచారణ జరిగితే నిజాలు తేలుతాయి కదా? అని అంటున్నారు. ఆ మాత్రం దానికి తడుముకుంటూ ఎందుకు చానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -