Btech Ravi: బిల్డ‌ప్ బీటెక్ ర‌వి పాచిక పార‌లేదా.. ఇడుపులపాయలో మరోసారి జగన్ సత్తా చాటారుగా!

Btech Ravi: ఇడుపులపాయలో మరొకసారి విజయ కేతనం ఎగురవేసింది వైఎస్ఆర్ సీపీ. వై నాట్ పులివెందుల అంటూ నానా హడావుడి చేసిన టీడీపీ వర్గం వారి నోరు మూయించింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇడుపులపాయ సర్పంచ్ ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఈ ఎన్నికలలో విజయకేతనం మాదే అంటూ నానా హడావిడి చేశారు.

అయితే ఇడుపులపాయలో టీడీపీ కి అంత సీన్ లేదు. కనీసం నామినేషన్ కూడా సక్రమంగా వేసుకోలేదు. టీడీపీ మద్దతుదారుడైన లక్ష్మణ్ వేసిన ఎన్నికల నామినేషన్ ని కూడా తిరస్కరించింది ఎన్నికల కమిషన్. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపిస్తున్నారు. అయితే అదంతా నిజం కాదని నామినేషన్ లో ఇంటి పన్ను చెల్లింపు వివరాలు ఇవ్వకపోవడం వలన..నామినేషన్ అభ్యర్థి వివరాలు ఓటర్ జాబితాలో ఒకలా నామినేషన్ లో మరొక లో ఉన్నాయని చెప్తున్నారు ఎన్నికల అధికారి.

 

లక్ష్మణ్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో అక్కడ వైయస్సార్ సీపీ అభ్యర్థి అయిన తుమ్మలూరు నాగమ్మ గెలుపే దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తుంది. దీంతో ఇడుపులపాయలో జగన్ మరోసారి తన సత్తా చాటినట్లుగా అయింది. బీటెక్ రవి పాచిక పారకపోవటం వలన నానా హడావుడి చేస్తున్నాడు బీటెక్ రవి. ఎంపీడీవో మల్లికార్జున్ ఉద్దేశపూర్వకంగానే ఇంటి పన్ను వివరాలు ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నారు.

 

అయితే దీనిని వైసీపీ బలంగా తిప్పి కొడుతుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వటానికి ఇబ్బంది పెట్టని తాము ఇతరత్రా అడ్డంకులు ఎందుకు సృష్టిస్తామని ప్రశ్నిస్తోంది. ఇడుపులపాయని అడ్డుపెట్టుకొని బీటెక్ రవి చంద్రబాబు నాయుడు దృష్టిలో పరపతి పెంచుకోవాలని నానా హడావుడి చేశాడు కానీ ఆయన పాచిక పారకపోవడంతో లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇడుపులపాయ వైసీపీ అడ్డా అందులో టీడీపీకి కనీసం అడుగుపెట్టే అర్హత కూడా లేదు అంటూ వైసీపీ వర్గం వారు భుజాలు ఎగురవేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -