Pains: సెక్స్ తర్వాత నొప్పి మంట.. సమస్యనా?

Pains: సాధారణంగా చాలామంది స్త్రీలకు సెక్స్ తర్వాత నొప్పిగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అనిపించడానికి ఈ వయస్సు సంబంధం లేదు. ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గినప్పుడు యోని పొడిగా అవుతుంది. ఈ హార్మోన్ యోని లోపలి పొరని మందంగా, తడిగా, సాగే గుణంతో ఉంచుతుంది. అయితే చాలామంది యోని పొడిబారటం అన్నది పెద్ద సమస్య కాదని లైట్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. యోని పొడిబారటం అన్నది సమస్య పెద్దగా మారి స్త్రీల సెక్స్ లైఫ్ పై ప్రభావం చూపుతుంది. దాంతో మహిళలు రతి సమయంలో నొప్పినీ, అసౌకర్యాన్నీ ఎదుర్కొంటారు.

అయితే, ఈ సమస్యని తగ్గించడానికి చాలా చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్త్రీల యోని మంటగా నొప్పిగా ఎందుకు అనిపిస్తుంది అన్న విషయానికి వస్తే.. ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గిపోయినప్పుడు ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. మెనోపాజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుతూ ఉంటుంది. ఓవరీలు ఈస్ట్రోజెన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ వల్లే స్త్రీ శరీరపు ఆకృతీ, రొమ్ముల పెరుగుదల ఉంటాయి. రుతుచక్రం లోనూ, గర్భధారణలో కూడా ఈస్ట్రోజెన్ హార్మోన్ కీ రోల్ పోషిస్తుంది. యోని లోపలి పొరని ఈస్ట్రోజెన్ మందంగా, తడిగా, ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

 

ఈ హార్మోన్ స్థాయి తగ్గుతుంటే మహిళలు యోని లోపలి పొర పల్చగా అవ్వడం, పొడిగా అవ్వడం, సాగే గుణంతగ్గడం, గులాబీ రంగు నుంచి నీలం రంగులోకి మారడం లాంటి మార్పులు గమనించవచ్చు. ఈ మార్పులని వజైనల్ యాట్రోఫీ అని కూడా అంటారు. కాగా షోగ్రిన్స్ సిండ్రోం ఈ సమస్య ఉన్నవారికి నోరూ, కళ్ళు పొడిగా అవుతూ ఉంటాయి. దీని వలన యోని పొడిగా అవ్వడం కూడా జరుగుతుంది. యాంటీ హిస్టమైన్స్ ఈ మందులు జలుబుకీ, ఎలర్జీ కీ వాడతారు. వీటి వలన యోని పొడిబారడం, మూత్రవిసర్జన లో సమస్యలు తలెత్తడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీ డిప్రెసెంట్స్ యాంటీ డిప్రెసెంట్స్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లో యోని పొడిగా అవ్వడం, కోరిక తగ్గడం, భావప్రాప్తి చేరుకోలేకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి.

 

వజైనల్ యాట్రొఫీ, వజైనల్ డ్రైనెస్ వల్ల సెక్స్ సమయంలో నొప్పి, అసౌకర్యం ఉండడమే కాకుండా వజైనల్ ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గడం వలన యూరినరీ ట్రాక్ట్ లోపలి పొర కూడా పలచగా అవుతుంది. అందువల్ల ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి రావడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ లాంటి సమస్యలు ఎదురౌతాయి. వీటిని జెనిటోయూరినరీ సిండ్రోం ఆఫ్ మెనోపాజ్ అని అంటారు. దీని వల్ల సెక్స్ తరువాత రక్తస్రావం, యోనిలో మంట, దురద లాంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల వల్ల మహిళలు సెక్స్ ని ఎంజాయ్ చేయలేరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -