Siddipet: ఘనంగా కూతురి వివాహం చేసిన మహిళ కానీ?

Siddipet: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ గుండె పోటు మరణాలలో ఎక్కువగా యుక్త వయసు ఉన్నవారు మరణిస్తుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు ఎక్కువగా కలవరపెడుతున్నాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న కొందరు ఒకసారిగా గుండెపోటుతో మరణిస్తున్నారు. దాంతో సంతోష సమయాలలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకుంటున్నాయి.

ఇటీవల ఒక వివాహిత పెళ్లిలో భరత్ జరుగుతుండగా డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే.. సిద్దిపేట జిల్లా బంజార గ్రామంలో జగిలి స్వరూప అనే 35 సంవత్సరాల వివాహితకు ముగ్గురు కూతుళ్లు. తాజాగా పెద్ద కూతురు వివాహం శుక్రవారం జరిగింది. వివాహ వేడుకకు బంధుమిత్రులు వచ్చి సంతోషంగా వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. పెళ్లికి వచ్చిన బంధువులతో ఇళ్లంతా ఆనందంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి కూతురుని అత్తగారింటికి పంపేందుకు సిద్దమవుతున్నారు.

 

ఇళ్లంతా సంతోషంగా ఉంది. అప్పటి వరకు బంధువులతో సంతోషంగా మాట్లాడిన స్వరూప ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. దాంతో పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అమ్ముకున్నాయి. కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపి అత్తారింటికి సాగనంపాలి అనుకుంది స్వరూప. తెల్లవారితే కూతుర్ని అత్తారింటికి పంపాల్సి ఉంది. దాంతో అందరూ సంతోషంలో ఉన్న సమయంలో ఈ విధంగా స్వరూప ఒక్కసారిగా గుండెపోటుతో మరణించడంతో పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు పెళ్లికూతురు గుండెలు విలసిలా రోదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -