Pawan – Geetha: పవన్ కళ్యాణ్, వంగా గీత ఆస్తుల అసలు లెక్కలు ఇవే.. ఎవరి ఆస్తి ఎంతంటే?

Pawan – Geetha: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌ వ‌ర్గం పై అందరి చూపు కొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో వైసిపి పార్టీ నుంచి వంగా గీతా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె కాకినాడ ఎంపీగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత పోటీ చేయబోతున్నారు కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి ఆసక్తి పిఠాపురం పైనే ఉంది.

వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ తరచూ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలా గెలుపోటములు విషయంలో మాత్రమే కాకుండా వేరే ఆస్తుల గురించి కూడా ప్రజలు లెక్కలు వేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురంలో నన్ను ఓడించడానికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు పంచిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని తెలిపారు.

ఈ విధంగా పిఠాపురంలో ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వంగా గీత పంచుతున్నారు అంటే ఆమెకు ఏ స్థాయిలో ఆస్తులు ఉన్నాయో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి ఆస్తులను బేరీజు చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.57 కోట్లుగా లెక్క‌గ‌ట్టారు. అప్పులు కూడా బాగానే ఉన్నాయి. ఇవి రూ.34 కోట్ల వరకు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా వివిధ బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు కార్లు కలిపి 2.75 కోట్ల వరకూ ఉంది. మొత్తం చరాస్తుల విలువ రూ.15 కోట్ల విలువ చేస్తాయని తెలుస్తుంది ఇవే కాకుండా హైదరాబాద్ శివారులో 18 ఎకరాల ఫామ్ అవుతుంది.

హైదరాబాద్‌లో 4 ఇళ్లు, మంగళగిరిలో రెండు ఇళ్లు ఉన్నాయి. వీటి విలువ రూ.34 కోట్లు ఉన్నాయి. అలాగే ర‌ష్యాలోనూ ఆయనకు ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ ఉంది. వీటి మొత్తం విలువ రూ.1.75 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. ఈ స్థిరాస్తుల విలువ రూ.42 కోట్ల వరకు చూపించారు ఇక వంగ గీత విషయానికి వస్తే..ఆమెకు నిక‌రంగా ఉన్న ఆస్తి రూ.20 కోట్ల‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవి కాకుండా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం , వాహనాలు అన్నీ కలిపి రూ.1.20 కోట్లుగా ఉన్నాయి.

వివిధ చోట్ల 25 ఎకరాల వరకు పొలం, ఎనిమిది ప్లాట్లు,10 ఇళ్లు, కమర్షియల్ బిల్డింగ్‌ ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు రూ.3.50 కోట్ల వరకు ఉన్నాయని తెలుస్తుంది ఇలా వీరిద్దరి ఆస్తుల వివరాలు గురించి కూడా ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -