Popcorn: ఆ సమయంలో పాప్‌కార్న్‌ తినొచ్చా!

Popcorn: ఆరోగ్యానికి పౌష్టికాçహారం మంచిది కాబట్టి.. ప్రతి ఒక్కరు ఎక్కువ ప్రోటీన్లు కలిగిన పదార్థాలను తినేందుకు ఇష్టపడుతారు. సాధారణ రోజుల కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో తల్లి ఆరోగ్యం.. పుట్టబోయే బిడ్డ పెరుగుదలకు పోషకాహారం ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ప్రెగ్నెన్సీ సమయంలో జంక్‌ఫుడ్‌ క్రేవింగ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత తినాకూడదనున్నా అది సాధ్యపడదు. వారంలో రెండు సారైనా జంక్‌ ఫుడ్‌ తినేస్తున్నారు.

అయితే..గర్భవతిగా ఉన్నప్పుడు పాప్‌కార్న్‌ తినడం మంచిదా.. లోపలున్న బిడ్డకు ఏదైనా హాని చేస్తుందా అని చాలా మంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో క్రేవింగ్స్‌ ఎక్కువగా ఉండటంతో పుల్లగా, తియ్యగా, కారంగా, తినాలనిపిస్తోంది. అయితే, గర్బధారణ సమయంలో ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్సెన్సీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు పోషక ఆహారం చాలా ముఖ్యమట. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తొమ్మిది నెలల పాటు ఆరోగ్యకరమైన, పోషక ఆహారం మాత్రమే తీసుకోవాలి. గర్భధారణ సమయంలో, మహిళలు డైట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కొంతమంది పాప్‌కార్న్‌ను జంక్‌ ఫుడ్‌ అని పిలుస్తారు, మరికొందరు దీన్ని మైక్రోవేవ్‌ కార్న్‌ అని అంటారు. ఏదేమైనా.. గర్భధారణ సమయంలో పాప్‌కార్న్‌ తినడం మంచిదా.. కాదా అని చాలా మందికి డౌట్‌లు వస్తున్నాయి.పాప్‌కార్న్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ.. తాజా కూరగాయల కన్నా తక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి గర్భిణులు వీటిని తక్కువగా తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పాప్‌కార్న్‌లో జింక్‌ అధికంగా ఉంటుంది. దీనిలో మినరల్స్, విటమిన్స్‌ ఎక్కువగా ఉండటంతో గర్భిణులకు అవి మేలు చేకూరుస్తాయి. పాప్‌కార్న్‌లో ప్రోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. దీనిలో అమైనో యాసిడ్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి గర్భంలో పిల్లల పెరుగుదలకు సహాయపడతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -