Rajamouli: పొన్నియిన్ సెల్వన్ సినిమాను చూసి రాజమౌళి ఆ పని చేయగలరా?

Rajamouli: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలకు దర్శకులకు నిర్మాతలకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. తమ సినీ కెరియర్ లో ఇలాంటి సినిమా తప్పకుండా చేయాలి అని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఇలా మణిరత్నం ఎప్పటికైనా పోన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా సినిమా చేయాలన్నది తనకలా అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈయన కల నెరవేరిందని చెప్పాలి.

పొన్నియన్ సెల్వన్ పుస్తకం ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని మణిరత్నం ప్రయత్నాలు చేశారు. అదే స్థాయిలో సినిమాని విడుదల చేసినప్పటికీ ఈ సినిమా కేవలం తమిళ సినిమా అనే ముద్ర వేయించుకొని పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకోలేకపోయింది.

 

అయితే మణిరత్నం చూసి జక్కన్న నేర్చుకోవాలని ఈయన కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పలువురు భావిస్తున్నారు.మహాభారతం తెరకెక్కించడం రాజమౌళి వంటి దర్శకులకు పెద్ద సమస్య కాదు అడిగిన మొత్తం డబ్బు పెట్టి నిర్మాతలు ఉన్నారు అనువైన టెక్నాలజీ కూడా ఉంది కనుక ఈ సినిమా చేయడం పెద్ద సమస్య కాదు.అయితే ఇది పీఎస్ సినిమా లాగా కేవలం ఒక వర్గానికి ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమిత కాకుండా ఉండాలని కొందరు భావిస్తున్నారు.

 

యూనివర్సల్ అప్పీల్ వచ్చేలా సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మార్చాలని.. అలా అని ఇతిహాసానికి ఇష్టమొచ్చినట్టు మార్పులు చేస్తే ఇబ్బందులు తప్పవని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాల విషయంలో ఎన్నో దృష్టిలో పెట్టుకొని చేస్తేనే సినిమాలు సక్సెస్ అవుతాయని లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఉదాహరణకు ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాని చూపిస్తున్నారు. మరి జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -