Sleep: రాత్రి సమయంలో నిద్ర పట్టటం లేదా.. అయితే ఇలా చేయండి?

Sleep: నిద్ర అనేది ఒక సుఖం లాంటిది. ఒక నిద్ర అన్ని బాధలను, కష్టాలను గుర్తుకు చేయకుండా ప్రశాంతంగా మరో లోకం అన్నట్లుగా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఒత్తిడిలు, సమస్యలు వంటివి ఉంటాయి. అంతేకాకుండా బయట పనిచేయటం, మాటలు పడటం ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంటికి రాగానే ఇంట్లో వారిపై కోపాలు చూపిస్తూ.. ఇక అవన్నీ పడుకునే ముందు కూడా ఆలోచించడం వల్ల నిద్ర అనేది ఉండదు.

 

ఇక ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లాంటిది ఉండటం వల్ల అసలు నిద్రపోవటమే మర్చిపోయారు జనాలు. ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నారు కొందరు. దీని వల్ల రేడియేషన్స్ ఏర్పడటమే కాకుండా సరైనా నిద్ర లేకపోవడంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో 11, 12 వీలైతే ఒకటి రెండు గంటల వరకు కూడా ఫోన్లు వాడుతున్నారు.

 

దీంతో సరైన నిద్రలేక మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఎటువంటి ఆలోచనలు లేకుండా, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంటూ హాయిగా నిద్ర పట్టాలి అంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే.. నిద్రకు 20 నిమిషాల ముందు స్నానం చేయాలి. ముఖ్యంగా బెడ్ రూమ్ నీట్ గా సర్దుకోవాలి. మరుసటి రోజు చేసే పనులన్నీ ఒక లిస్టులో రాసుకోవాలి. ఆ తర్వాత మందంగా ఉండే దుప్పటి కప్పుకొని హాయిగా పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఆలోచనలు రావు. దీనివల్ల ఆటోమేటిక్ ఫోన్ లు కూడా దూరం పెట్టేస్తారు అని తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఇది ఫాలో అవ్వటం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -