Sleep: నిద్రించే ముందు నిద్ర లేచాక‌ ఈ దేవుళ్లను స్మరించుకుంటే తిరుగులేదట.. ఏమైందంటే?

Sleep: మామూలుగా చాలామందికి నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడం దేవుడి ఫోటోకి మొక్కుకోవడం అలవాటు. నిద్రకి ముందు అలానే నిద్రలేచిన తర్వాత దేవుడిని స్మరిస్తే, చక్కటి శాంతి మనకి లభిస్తుంది. శారీరిక, మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటాము. అన్ని జీవులు కూడా నిద్రపోతూ ఉంటాయి. అయితే దైవాన్ని నమ్మే ప్రతి మనిషి కూడా నిద్రపోవడానికి ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలి.

ఏ పని చేసినా కూడా మనం దైవనామస్మరణ చేయాలి. నిద్రించే ముందు శివుడిని స్మరించుకుంటే, చాలా మంచిది. ఓం నమశ్శివాయ అని శివుడిని ధ్యానిస్తూ నిద్రలోకి వెళ్లాలి. శివుడు లయకారుడు. శివుడిని స్మరిస్తూ, నిద్రలోకి వెళ్లడం వల్ల పీడకలలు రావు. హాయిగా నిద్రపోవచ్చు. అదే విధంగా నిద్రలేచిన వెంటనే, మనసులో విష్ణు నామాన్ని స్మరించుకోవాలి. విష్ణువు అంటే స్థితికారుడు. మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా విష్ణువు ఉంచుతాడు. కనుక విష్ణువుని స్మరిస్తూ మేల్కొన‌డం మంచిదని పండితులు అంటున్నారు. ఏదో ఒక విష్ణు మంత్రాన్ని జపిస్తూ నిద్రలేస్తే చాలా మంచి జరుగుతుంది. నారాయణుడు మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతాడు.

 

నిద్ర మేల్కొన్న తర్వాత కళ్ళు తెరిచే ముందు రెండు అరచేతులు రాపిడి చేసుకోవాలి. తర్వాత కళ్ళ మీద చేతులతో అద్దుకోవాలి. ఆ తర్వాత అరచేతుల్లోకి చూసుకుంటూ, కళ్ళు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవులు కొలువై ఉంటారు. ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉండవచ్చు. చాలామంది పని మీద బయటకు వెళ్ళినప్పుడు పని సరిగా జరగకపోతే ఈ రోజు పొద్దున్నే ఎవడి ముఖం చూసాము అని తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అలా తిట్టుకోకుండా ఉదయాన్నే దేవుడు మొఖం చూడడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -