Sleep: ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు నిద్రపోకూడదా.. అలా పడుకుంటే ఏకంగా ఇంత ప్రమాదమా?

Sleep: సాధారణంగా మనం నిద్రపోయే సమయంలో చాలామంది చాలా ఇలా పడుకోకూడదు ఇలా పడుకోవాలి అంటూ కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు ఉత్తరం దిశ వైపు తలపెట్టి నిద్రపోకూడదని చాలామంది చెబుతుంటారు. అలా ఎందుకు నిద్ర పోకూడదు అని విషయానికి వస్తే…

 

సైంటిఫిక్ పరంగా మనం ఉత్తరం దిశ వైపు తలపెట్టి నిద్రపోవటం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదని అందుకే ఉత్తరం దిశ వైపు తలపెట్టి నిద్రపోకూడదని చెబుతారు. ఆధ్యాత్మికపరంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం దిశ వైపు ఎందుకు తలపెట్టకూడదు అనే విషయానికి వస్తే.. ఉత్తరం దిశ వైపు తలపెట్టడం వల్ల చెడు కలలు వస్తాయని అందుకే ఉత్తర దిశ వైపు కూడా నిద్రపోకూడదని చెబుతుంటారు.

పురాణాల ప్రకారం పార్వతి దేవి వినాయకుడినీ తయారుచేసితాను స్నానానికి వెళ్లే సమయంలో ఎవరు లోపలికి రాకుండా ఉండడం కోసం బయట వినాయకుడిని కాపలాగా పెడుతుంది. అయితే శివుడుఅదే సమయంలో అక్కడికి వచ్చే కైలాసం లోకి వెళ్లడానికి ప్రయత్నం చేయగా వినాయకుడు మాత్రం లోపలికి వెళ్లడానికి నిరాకరిస్తారు.

 

ఈ విధంగా వినాయకుడు నిరాకరించడంతో శివుడు ఆగ్రహంతో తన తల నరికి వేస్తాడు. అనంతరం పార్వతీదేవి తలని అతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో శివుడు ఉత్తర దిశగా తల పెట్టుకుని నిద్రపోతున్నటువంటి ఏనుగు తలను తెచ్చి వినాయకుడికి అతికిస్తారు. అందుకే ఉత్తర దిశ వైపు తల పెట్టుకుని పడుకోకూడదని ఆధ్యాత్మికపరంగా చెబుతుంటారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -