Capital: విశాఖలోనే అసలైన రాజధాని!.. వైసీపీ నాయకుల మాటల వెనక అర్థమేమిటి..?

Capital: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత.. మూడు రాజధానులు అనే అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని చెబుతున్న వైసీపీ.. మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వస్తుంది. ఇందుకు సంబంధించి బిల్లులను కూడా పాస్ చేసింది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ఏకైక రాజధానిగా కొసాగాలని ఆ ప్రాంత రైతులు పోరాడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి రగిలింది. ఇప్పటికీ రగులుతూనే ఉంది.

అయితే ఈ ఏడాది మార్చిలో రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత పరిస్థితులు కొన్ని నెలల పాటు చల్లబడ్డాయి. అయితే గత రెండు నెలలుగా పరిస్థితులు మరోసారి వేడెక్కాయి. రైతులు రెండో విడత పాదయాత్ర, కౌంటర్‌గా వైసీపీ ఉత్తరాంధ్ర అభివృద్ది రాగం, జేఏసీ ఏర్పాటు, రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయడం జరిగింది.

 

అయితే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులని పైకి చెబుతున్న.. లోపల మాత్రం ప్రధానంగా విశాఖను రాజధాని చేయడమే వారి లక్ష్యమని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అమరావతి రాజధానిని అభివృద్ది చేయడం ఇష్టం లేకపోవడం వల్లనే జగన్ ఇలా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆ వాదనలకు బలం చేకూర్చే అవకాశం ఉంది.

 

కర్నూలు న్యాయ రాజధాని విషయంలో నామామాత్రంగా మాట్లాడుతున్న వైసీపీ నేతలు.. విశాఖ పరిపాలన రాజధాని విషయంలో మాత్రం గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇటీవల నిర్వహించిన విశాఖ గర్జన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి నేతలు వచ్చారు. అన్ని ప్రాంతాలు విశాఖ పరిపాలన రాజధానిగా ఉండేందుకు అంగీకరిస్తున్నాయని చెప్పేశారు. మరోవైపు ఉత్తరాంధ్రకు రాజధాని వద్దా? అని ఆ ప్రాంత నాయకులు ప్రతిపక్ష పార్టీ, మూడు రాజధానులను వ్యతిరేకించేవారిపై ఎదురుదాడి చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే విశాఖలో పరిపాలన రాజధానికి మద్దతుగా నిర్వహిస్తున్న సమావేశాల్లో వైసీపీ నేతుల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వికేంద్రీకరణకు మద్దతుగా ఉద్యమం చేస్తున్నామని చెబుతూనే.. విశాఖే అసలు రాజధాని అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకొవద్దని ఉత్తరాంధ్ర ప్రజలను కోరుతున్నారు. ఇటీవల ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. పేరుకు మూడు రాజధానులు అని చెప్పినప్పటకీ.. పాలన మొత్తం విశాఖ నుంచే సాగుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరుగుతాయని.. న్యాయపరమైన నిర్ణయాలు కర్నూలులో తీసుకుంటారని.. పరిపాన రాజధాని విశాఖలోనే ఉటుందని చెప్పారు.

 

ఇక, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ.. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేయడంలో తాను ఆచరణాత్మకంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. సీఎం ఎక్కడుంటే అక్కడే మంత్రివర్గం ఉంటుందని.. మంత్రివర్గం ఉన్నచోటే సచివాలయం ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలతో కూడిన ఏకైక అతిపెద్ద నగరం విశాఖ అని చెప్పారు. రూ. 5,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల పెట్టుబడితో తాము దానిని పూర్తి స్థాయి రాజధానిగా మార్చగలమని చెప్పారు. అదే సమయంలో వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ది చెందుతాయనే మాట కూడా చెప్పేశారు.

 

వికేంద్రీకరణ పదాన్ని ప్రస్తావించే సమయంలో.. అన్ని ప్రాంతాల అభివృద్ది చెందాలనేదే తమ లక్ష్యమని సీఎం జగన్‌, మంత్రులతో సహా వైసీసీ నాయకులు మొత్తం చెబుతుంటారు. అయితే ఇటీవల కాలంలో సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ విశాఖ అసలైన రాజధాని అనే సంకేతాలు పంపుతుందని రాజకీయ విశ్లేష్లకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -