AP Politics: తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వైసీపీ బీసీ ఎంపీ.. సీమలో వైసీపీ వీక్ అవుతోందిగా!

AP Politics: వైసీపీ అధినేత జగన్ ఏమనుకుంటున్నారో తెలియదు కానీ.. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. నేతలంతా వరుసగా పార్టీలు మారుతున్నా.. లైట్ తీసుకుంటున్నారు. వైసీపీకి తిరుగు లేదు అనుకునే రాయలసీమలో కూడా ఎదురుగాలి వీస్తోంది. కీలక నేతలు టీడీపీ గూటికి చేరుతున్నారు. కర్నూలు జిల్లా వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరిపోయారు. చంద్రబాబు సంజీవ్ కుమార్ ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ అధినేత జగన్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న టైంలోనే ఇలా జరగడం పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. జగన్ ఒంటెద్దు పోకడలే ఆయన సంజయ్ కుమార్ పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది. కర్నూల్ ఎంపీగా పోటీ చేయించడానికి కొత్త అభ్యర్థి కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు.అందుకే సంజీవ్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ భారీ మెజార్టీతో గెలిచారు. విద్యావంతుడు, ప్రజలతో మమేకం అయ్యే గుణం ఉండటంతో స్థానికంగా మంచి పేరుంది. పైగా బీసీ సామాజిక వర్గం నేత కావడంతో ఆయా వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక్క కర్నూల్ లోనే కాకుండా.. రాయలసీమ మొత్తం మీద బీసీల్లో ఆయన మంచి ఆదరన ఉంది.

అయితే.. వైసీపీ అధినేత జగన్ చేయించిన సర్వేల్లో సంజీవ్‌కు వ్యతిరేకంగా రావడంతో ఆయనకు టికెట్ నిరాకరించారు. దీంతో.. ఆయన నెలరోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే టీడీపీతో టచ్ లోకి వెళ్లి మంచి ముహూర్తం చూసుకొని సైకిల్ ఎక్కేశారు. చంద్రబాబు త‌న‌కు ఎలాంటి అవ‌కాశం ఇచ్చినా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు.

టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మికే ప్రజలు పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ పాల‌న‌లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తాను ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. రాజ‌కీయాలు నీకు తెలియ‌వంటూ అవ‌మానించార‌ని ఆరోపించారు. రాజ‌కీయాలు తెలియ‌ని వాడిని గత ఎన్నికల్లో ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీ లాడ్స్ కేటాయించినా అభివృద్ధి ప‌నులను అడ్డుకున్నారని ఆరోపించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీని వీడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం ఇటీవలే పార్టీకి గుడ్ బై టీడీపీలో చేరారు. ఇప్పుడు ఎంపీ సంజీవ్ కుమార్ తెలుగుదేశం గూటికి చేరారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజెంద్రా నాథ్ రెడ్డి మేనమామ కూడా ఇటీవల వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. వరుస వలసలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోజురోజుకు వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక ఎంపీ స్థానానికి సిట్టింగులకు మార్చి కొత్తవారికి టికెట్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలో పొలిటికల్ ఈక్వివేషన్స్ మారిపోయాయి. వైసీపీలో ఉంటూనే నలుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ అధిష్టానంతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. వీరంత ఇవాలో, రేపో పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -