AP Capital: ఏపీ రాజధాని గురించి క్లారిటీ వచ్చేసింది.. ఏం జరిగిందంటే?

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం లో మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని ఆయన చెప్పారు. మూడు రాజధానులను తాము ప్రకటించినా అవి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి కాబట్టి అప్పటివరకు రాజధాని అమరావతి మాత్రమే అన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన వెంటనే రాజధానుల నిర్మాణం చేపడతామని కూడా రాంబాబు తెలిపారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతోనే మూడు రాజధానులు సాధ్యం కావడం లేదన్నారు.

 

వాస్తవానికి అమరావతిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిలో మొదటి నుంచి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. అలాంటి రాంబాబే ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి తాము అనుకూలమే అని వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే 2019లో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ ప్లేటు ఫిరాయించింది.

ఇందులో భాగంగా విశాఖపట్నం ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానులకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలు చెల్లవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. రాజధాని అమరావతి పై తరచూ మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అది ఒక కులానికి రాజధాని అని కొందరు, అమరావతి కాదు భ్రమరావతి అని కొందరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే అది రాజధాని అని కొందరు కామెంట్లు చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో అంబటి రాంబాబు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేది కొంచెం ఆలోచించవలసిన విషయమే.

 

వచ్చే ఎన్నికలలో రాజధాని ప్రాంత ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండటానికి అంబటి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు రాజకీయ వర్గాలవారు. నిజానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ నేతలకు ఈసారి ఎన్నికలలో గుంటూరు, కృష్ణాజిల్లాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -