AP Politics: ఏపీలో అసలు యుద్ధానికి నెల రోజులే సమయం.. ఏ పార్టీ విజయం సాధిస్తుందో?

AP Politics: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు వేడి కనిపిస్తుంది. అన్ని పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అందరి చూపు ఏపీపై పడింది. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ దేశంలో అన్నిటికంటే విచిత్రంగా ఉంటాయి. ప్రజలకు పొలిటికల్ నాలెడ్జ్ ఎక్కువ. చీమ చిటుక్కుమన్నా… వెంటనే తెలిసిపోతుంది. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ కు వెళ్లామా? ఓటు వేశామా? అన్నట్టు ఏపీ ఓటర్లు ఉండరు. అంతకు మించిన పాత్ర పోషిస్తారు. అందుకే, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై బాగా చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలు ప్రచారాలతో బిజీగా ఉన్నాయి. ఇంకా ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేదు. పార్టీల అధినేతలు క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిగా ఉంటున్నారు.

సిద్దం సభల తర్వాత వైసీపీ అధినేత మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించకపోయినా.. తిరుగుతున్నారు. అక్కడ అభ్యర్థులు ప్రజలకు పరిచయం చేస్తున్నారు. మరో సారి వైసీపీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్ స్పీడ్ రోజురోజుకి తగ్గుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన సమయంలో ఉన్న జోరు తర్వాత కనిపించడం లేదు. అభ్యర్థులు ప్రకటన చేస్తుండగానే… సిద్దం సభలు నిర్వహించారు. కానీ.. నాలుగు సిద్దం సభలు నిర్వహించడానికి చాలా సార్లు వాయిదా వేసారు. ఇన్ని సార్లు వాయిదా పడుతుందంటే .. జగన్ ఏమైనా కీలకైమన ప్రకనట చేస్తారా? అనుకున్నారు. కానీ, ఎప్పటిలాగే చంద్రబాబు, పవన్ ను తిట్టడంతోనే నాలుగు సిద్దం సభలు ముగించారు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మేమంతా సిద్దం సభలు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అక్కడ పెద్దగా స్పందన రావడం లేదు. ఈ నెలఖరుకి బస్సు యాత్ర కూడా పూర్తి అవుతుంది. కానీ, ఇంత వరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఈ సభల్లో కూడా చంద్రబాబు, పవన్ ను తిట్టడం. అభ్యర్థులను ప్రకటించడంతో ముగిస్తున్నారు. మొన్న ఉగాదికి మ్యానిఫెస్టో రిలీజ్ అన్నారు. కానీ, జరగలేదు. దీంతో.. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. అసలు వైసీపీకి ఏం చూసి ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు, పవన్ దూకుడు పెంచారు. ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి ప్రచారానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఊకపోస్తే ఊక రాలనంతగా జనం నుంచి స్పందన వస్తుంది. అంతేకాదు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే పలువర్గాలకు హామీలు ఇచ్చారు. మెగా డీఎస్సీ అని ప్రకటించారు. విద్యాంగులకు 6 వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు. నేతన్నలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఒక్కో సభలో ఒక్కో ప్రకటన చేస్తున్నారు. అంతేకాదు.. సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మిని మ్యానిఫెస్టో విడుదల చేసింది. అది ఇప్పటికే ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆయా వర్గాలను సూపర్ సిక్స్ హామీలు ఆకట్టుకుంటున్నాయి. సూపర్ సిక్స్ హామీలను కొంతమంది వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. నెల రోజుల క్రితం పార్వతీపురంలో పెళ్లి చేసుకున్న ఓ జంట సూపర్ సిక్స్ హామీలతో పెళ్లి కార్డు డిజైన్ చేశారు. ఇలా టీడీపీ ఇంటింటికి వెళ్తుంది. దీంతో ప్రచారంలో కూటమి ముందుంది. వైసీపీ మాత్రం అధినేత జగన్ తో పాటు నాయకులు కూడా బాగా వెనకబడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -