Casting Couch: వామ్మో.. హీరోయిన్ కీర్తి సురేష్ లో ఈ కోణం కూడా ఉందా?

Casting Couch: కేరళ కుట్టి.. కీర్తి సురేష్‌ తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి రాణిస్తోంది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటి చిత్రంలో కీర్తి సురేష్‌ నటన అద్భుతం అంటూ అనేకమంది ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ జీవించేశారు. మహానటి మళ్లీ పుట్టిందా అన్నట్లు ఆమె నటన సాగింది.

తర్వాత మహేష్‌బాబు లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. సర్కారు వారి పాటలో కాస్త డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో నటించిన కీర్తి సురేష్‌.. తర్వాత ప్రస్తుతం కెరీర్‌లో బాగానే ముందుకెళ్తోంది. అటు తమిళంలోనూ అగ్ర హీరోల సరసన నటించింది కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆమెలా నటించే వారు కాస్త అరుదుగానే ఉంటారని చెబుతారు. ఎక్స్‌పోజింగ్‌, గ్లామర్‌ పాత్రలకుకాస్త దూరంగా ఉండే కీర్తి సురేష్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు గౌరవం ఉంది. అదే కారణంతో ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ కూడా సంపాదించుకుంది.

కానీ, కెరీర్‌ మంచి ఊపు మీద ఉన్న కీర్తి సురేష్‌.. మధ్యలో కొన్ని ప్లాప్‌ సినిమాల్లో నటించి కాస్త డ్యామేజీ చేసుకుంది. రీసెంట్‌గా సర్కారు వారి పాట చిత్రంతో సక్సెస్‌ ట్రాక్‌పైకి మళ్లీ ఎక్కినట్లయ్యింది. కీర్తి పెళ్లిపై కూడా అనేక వార్తలు వచ్చాయి. పద్ధతి కలిగిన పిల్ల.. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు కూడా చాలా కాలంగా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు సమాచారం.

అయితే, రీసెంట్‌గా కీర్తి సురేష్‌ మాటలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించిన వార్తలపై ఆమె స్పందించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందనేది తనకకు తెలుసని కీర్తి సురేష్‌ చెప్పారు. తనతోపాటు నటిస్తున్న తోటి హీరోయిన్లు దీని గురించి తన వద్ద చెప్పారని బాంబు పేల్చింది కీర్తి సురేష్‌. అయితే, క్యాస్టింగ్ కౌచ్ అనేది తన వరకు రాలేదని స్పష్టం చేసింది. మనం ప్రవర్తించే తీరును బట్టి ఇది ఉంటుందంటూ కీర్తి వ్యాఖ్యానించింది. అలా నిజంగా కమిట్మెంట్ అడిగితే సినిమాలు మానేసి ఉద్యోగం చేస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అలాంటి కమిట్మెంట్‌ ఇవ్వబోనని స్పష్టం చేసింది కీర్తి సురేష్‌. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -