Celebraties Intercaste Marriages: టాలీవుడ్ ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా?

Celebraties Intercaste Marriages: మనదేశంలో కులానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మనందరికీ తెలిసిందే. వారి స్టేటస్ ఏ విధంగా ఉన్నప్పటికీ వారు తమ కులానికి చెందిన వారిని చేసుకుంటారు. ఈ విషయంలో పెద్దలు ఏమాత్రం రాజీపడరు. అలా మన దేశం కులానికి పుట్టినిల్లుగా మారింది. ఇక ఇలాంటి కుల పుట్టింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోని కూడా ఉంటుంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కులాన్ని పక్కకు నెట్టి తమకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మనం వారి వివరాలు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి అప్పటి అగ్రస్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి సూపర్ స్టార్ కృష్ణ కూడా విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఇంకో విషయం ఏమిటంటే.. సూపర్ స్టార్ కృష్ణకు మొదట ఇందిరా దేవితో వివాహమైంది. అయినప్పటికీ కృష్ణ పెద్దల అంగీకారంతో రెండవ పెళ్లి చేసుకున్నారు.

అలాగే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడుగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగార్జున ముందుగా డి రామానాయుడు కూతురు లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడంతో అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇక తెలుగు ఇండస్ట్రీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మొదటిగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంకు చెందిన నందిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికీ మనస్పర్ధలు రావడంతో తర్వాత విడిపోయారు. అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి బాంధవ్య జీవితం కూడా ఎన్నో రోజులు సాగలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ విదేశీయురాయులైన అన్నా లెజోవాను మూడవ పెళ్లి చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి, మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -