Celebrities: సమంత, దీపిక పదుకొనేకు అలాంటి భయంకరమైన వ్యాధులు?

Celebrities: సాధారణంగా సినీ ఇండస్ట్రీ అన్నాక.. చాలామంది స్టార్లు వృత్తి పరంగా చాలా బిజీ అయిపోతూ ఉంటారు. వీరు ఇంత బిజీగా ఉన్నప్పటికీ.. చూడ్డానికి ఎంతో ఆనందంగా లోపల ఎటువంటి బాధలేనట్టుగా కనబడుతూ ఉంటారు. కానీ కొంతమంది నటులకు ఎవరికీ చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న యాక్టర్లు వారి అభిమానులకు తెలియకుండా.. ఆ బాధను అలాగే దిగమింగుకొని ఉంటారు. అనారోగ్య సమస్యతో పోరాడి గెలుస్తారు. మరి ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో అదే రకంగా అనారోగ్యంతో పోరాడి గెలిచిన యాక్టర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రజినీకాంత్: సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ఇతడికి దేశ వాప్తంగా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. కానీ 2011లో ఇతడికి బ్రాంకైటిస్‌ అనే వ్యాధి సోకింది. దాని కారణంగా ఒక పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అయ్యి.. చికిత్స పొందిన తర్వాత బయటపడ్డారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకని కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.

సమంత:  ఇక సమంత గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో నవ్వుకుంటూ.. కనిపించే ఈ అమ్మడికి తీవ్రమైన అనారోగ్య సమస్య ఎదురయింది. ఈమెకు 2012లో పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే ఘోరమైన అనారోగ్య పరిస్థితి ఎదుర్కొంది. ఈ వ్యాధి కలిగిన వారు సూర్య రష్మి తగిలితే చాలా ఇబ్బంది పడిపోతారట. మరి ఇలాంటి అనారోగ్య పరిస్థితితో సమంత పోరాడి గెలిచింది.

హృతిక్ రోషన్: బాలీవుడ్ అగ్రస్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ స్టార్ హీరో చిన్నతనం నుంచి నత్తి తో బాధపడుతూ ఉండేవాడు. తర్వాత ఇతడికి స్పైనల్ స్టెనోసిస్ ఉన్నట్లు తేలిపోయింది. ఇది తీవ్రమైన అనారోగ్య పరిస్థితి అన్నట్లు తెలుస్తుంది. దీని నుంచి మెరుగుపరడానికి.. ఇతడు అనేక రకాల చికిత్సలు చేయించుకున్నాడట.

సల్మాన్ ఖాన్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ట్రిజెమినల్ న్యూరల్జియాతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఈ అనారోగ్య సమస్యతో.. ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

దీపికా పదుకనే: ఇదేవిధంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకనే తన లవ్ బ్రేక్ అప్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఈమె తన లవర్ తో బ్రేక్ అప్ కారణంగా ఈ అమ్మడు.. చాలా డిప్రెషన్ కు గురైనట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -