Celebrities: మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప్రముఖ సినీ సెలబ్రిటీలు వీళ్లే!

చిత్రసీమలో పెళ్లిళ్లు చేసుకోవడం ఎంత కామనో.. విడిపోవడం కూడా అంతే కామన్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సినిమా వాళ్ల వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. సినిమాల్లో హిట్ కొడుతున్నా వ్యక్తిగతంగా ఫెయిల్యూర్ అవుతుంటారు చాలా మంది స్టార్లు. వీళ్ల జీవితాల గురించిన పుకార్లు, గాసిప్స్ అందరికీ ఆసక్తికరంగానే ఉంటాయి.

మంచి సమయం, మంచి సెలబ్రిటీని చూసుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే, వ్యక్తిగత జీవితంలో అనేక అంశాలపై ఇగో సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి ఒకరంటే ఒకరికి పొసగక విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు.

వీరిలో పవన్ కల్యాణ్ ఒకరు. పవన్ మొదట నందినిని పెళ్లాడారు. కొంత కాలానికి వీరిద్దరూ విడిపోగా, తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు పవన్. అనంతరం ఆమెను వివాహం చేసుకున్నారు. అటు తర్వాత రేణు దేశాయ్ కి విడాకులిచ్చిన పవన్.. రష్యా నటి అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.

కమల్ హాసన్ కూడా.. గ్రేటెస్ట్ నటుడు, లోకనాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలుత వాణి గజపతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చి సారికను పెళ్లి చేసుకకున్నాడు. అనంతరం గౌతమితో సహజీవనం చేశాడు. ఇప్పుడు ఈమెతో కూడా విడిపోయాడు కమల్.

ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారి జాబితాలో ఉన్నాడు. ఫస్ట్ రిచా శర్మ, తర్వాత రియా పిళ్లై, మూడో పెళ్లి మాన్యతతో జరిగింది.

హీరోయిన్ రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మొదట రీనా దత్తాను, తర్వాత కిరణ్ రావును, ఇప్పుడు ఫాతిమా సనా షేక్ ను వివాహం చేసుకున్నాడు.

ఈ జాబితాలో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా ఉన్నారు. కిశోర్ కుమార్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -