Kishan Reddy: కిషన్ రెడ్డి ఆస్తులు ఏడాదితో ఎంత పెరిగాయో తెలుసా? బయటపడ్డ షాకింగ్ విషయాలు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా… ఆ తర్వాత కేంద్ర సహాయమంత్రి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగారు. తెలుగు ప్రజలకు కిషర్ రెడ్డి గురించి తెలిసిందే. గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయనకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి ఆయనే. బీజేపీలో సాధారణ కార్యకర్తల నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం కేంద్రమంత్రి స్థాయికి చేరుకున్నారు. తొలి నుంచి బీజేపీ పార్టీలోనే ఆయన ఉన్నారు.

కిషన్ రెడ్డికి ఇతర పార్టీల నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇతర పార్టీల్లో నేతలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఉన్నవారు డబ్బులు సంపాదించడం సహజమే. ఇక కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు చాలా పరిచయాలు ఉంటాయి. అక్రమంగా సంపాదించేవారు కొంతమంది అయితే… నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించేవారు మరికొంతమంది ఉంటారు. రాజకీయ నాయకులకు వివిధ రూపాల్లో డబ్బులు వచ్చేస్తుంటాయి. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆస్తుల గురించి ఒక విషయం చర్చనీయాంశంగా మారింది.

తన వ్యక్తిగత కుటుంబ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి కిషన్ రెడ్డి సమర్పించారు. ఈ వివరాలు బయటపడటంతో.. ఆయన ఆస్తుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వివరాల ప్రకారం 2022 మార్చి 321 నాటికి కిషన్ రెడ్డి కుటుంబ ఆస్తుల మొత్తం రూ.22.54 కోట్లుగా ఉంది. ఇక అప్పులు రూ.1.59 కోట్లుగా ఉంది. ఈ ఒక్క ఏడాదిలో ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.4 కోట్లు పెరిగింది. 2021తో పోల్చితే ఈ ఏడాది మార్చి నాటికి ఆయన కుటుంబ ఆస్తులు రూ.4.34 కోట్లు పెరిగాయి. ఇఖ అప్పులు రూ.7 లక్షల మేర తగ్గినట్లు తెలిపింది.

ఇక కిషన్ రెడ్డి పేరు మీద రూ.1.44 కోట్ల ఆస్తులు ఉండగా.. ఆయన సతీమణి కావ్య పేరు మీద రూ.12.83 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ఆమె పేరు మీద రూ.7516190 అప్పులు ఉన్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే ఆమె ఆస్తి రూ.64688046 పెరగ్గా.. అప్పు రూ.716190 మేర పెరిగింది. ఇక హిందూ ఉమ్మడి కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తి విలువ రూ.12323000 ఏ మాత్రం పెరగేలేదని పీఎంవోకు సమర్పించిన వివరాల ద్వారా బయటపడింది.

ఇక కిషన్ రెడ్డి కుమార్తె వైష్ణవి పేరు మీద రూ.5.51 కోట్ల ఆస్తి, రూ.84.33 లక్షల అప్పు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఆమె ఆస్తి రూ.1.87 కోట్లు పెరగ్గా.. అప్పులు రూ.76.66 లక్షల మేర తగ్గింది. ఇక కుమారుడు పేరు మీద రూ.9752600 ఆస్తులు ఉండగా.. గత ఏడాదితో పోలిస్తే రూ.9515000 పెరిగింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆస్తికి సంబంధించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. ఒక్క ఏడాదిలో ఆయన ఆస్తి విలువ పెరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -