CM KCR: పంతం నెగ్గించుకున్న బీజేపీ.. కేంద్రం దారిలోనే సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణ బీజేపీ పంతం నెగ్గించుకుంది. సీఎం కేసీఆర్ పై బీజేపీ సక్సెస్ కొట్టింది. ఎట్టకేలకు కేసీఆర్ తొలగ్గి కేంద్ర ప్రభుత్వ దారిలోనే నడుస్తున్నారు. దీనిని బట్టి చూస్తే టీఆర్ఎస్ సర్కార్ దొగివచ్చేలా చేయడంలో రాష్ట్ర బీజేపీ, కేంద్ర ప్రభత్వం విజయం సాధించిందని చెప్పవచ్చు. దీని వల్ల క్రెడిట్ ను తమ ఘాతాలో బీజేపీ వేసేసుకుంది. ఇంతకు బీజేపీ సాధించిన సక్సెస్ ఏంటి? కేసీఆర్ తలోగ్గి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనుకుంటున్నారా.. అదే తెలంగాణ విమోచన దినోత్సవం.

తెలంగాణ విమోచన దినోత్సవంపై సీఎం కేసీఆర్ తలొగ్గారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్రం ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త పీంఛన్ల పంపిణీ, పోడు భూముల సమస్యలతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వజ్రోత్సవ ప్రారంభోత్సవ వేడుకులను ఘనంగా జరపాలని కేబినెట్ నిర్ణయించింది.

నిజాం రాక్షస పాలన, అరాచకాల నుంచి తెలంగాణకు విముక్తి జరిగి సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతోంది. అందుకని విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో, 2014 ఎన్నికలకు తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర తర్వాత విమోచన దినోత్సవం జరపడంపై కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదు. దీంతో ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించడం లేదనే ఆరోపణలు బీజేపీ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

దీనిని బీజేపీ నేతలు ఒక ఆయుధంగా ఉపయోగించుకుని కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అమిత్ షా తెలంగాణలో బహిరంగ సభ పెట్టినపప్పుడల్లా ఇదే అంశంపై కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతి అంశంలో కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రభుత్వం తరపున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.

హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు జరపాలని నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. నిజం పాలనలో తెలంగాణతో పాటు హైదరాబాద్ సంస్ధానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్రలు భాగమయ్యాయి. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్ణాటక సీఎం బసవరాజుని కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఇక ఆర్ఎస్ఎస్ ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాలను జరపాలని నిర్ణయించింది.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఊహించని ఈ నిర్ణయంతో కేసీఆర్ కు షాక్ తిగిలినట్లు అయింది. కేంద్రం అధికారికంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించకపోతే ప్రజల్లో వ్యతిరేకన భావన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అాధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీ దారిలోనే కేసీఆర్ నడవాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో తాము సక్సెస్ సాధించామని, తమ డిమాండ్ కు కేసీఆర్ తలొగ్గారని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -