Samantha-Chaitanya: ఆ పనికిమాలిన పని వల్లే చైతన్య సమంత విడిపోయారా?

Samantha-Chaitanya: గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య ల విడాకులకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వారు విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఇదీ కారణం అంటూ రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరూ ఎందుకు విడిపోయారో ఇప్పటివరకు పూర్తిగా ఎవరికీ తెలియదు.

విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటారు. అందులో భాగంగానే ఒక న్యూస్ ఈమధ్య బయటకు వచ్చి మరింత వైరల్ అయింది. అదేంటంటే విడాకులు తీసుకోవడానికి ముందు.. చైతన్య, సామ్ లు కామన్ ఫ్రెండ్ ఫంక్షన్ కి కలిసి వెళ్లారు.

 

అప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ గా నటించింది సమంత. ఆ ఫంక్షన్ లో ఆ సినిమా గురించి అందరూ చర్చించుకోవడం చైతన్య కి చికాకు తెప్పించిందంట. ఆ ఫంక్షన్ లో అందరూ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించే అడగటం మొదలుపెట్టారట. దాంతో వెర్రెక్కిన నాగచైతన్య అందుకే ఇలాంటివి చేయొద్దు అనేది అంటూ అక్కడే సమంత పై మండిపడ్డాడట.

 

అందుకు ఆగ్రహించిన సమంత ఇంటికి వచ్చిన తర్వాత చైతన్య పై మరింత విరుచుకుపడిందని సమాచారం. ఇదే విషయంపై మాటకు మాట పెరిగి విడాకుల వరకు దారి తీసింది అని సమాచారం. మొదట విడాకులు అడిగింది తానే అని సమంత చెప్పటం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ సమయంలో నాగర్జున జోక్యం కల్పించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడం విచారకరం.

 

ఆరోజు ఆ ఫంక్షన్ కి వెళ్లి ఉండకపోయి ఉంటే ఈరోజు ఆ జంట కలిసి ఉండేదేమో అని అభిప్రాయపడుతున్నారు అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు. అయితే విడిగా ఉండటం వల్లే సంతోషంగా ఉన్నామని అటు చైతన్య ఇటు సమంత కూడా చెప్పటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -