Chalaki Chanti: జబర్దస్త్ పై చంటి వైరల్ కామెంట్స్.. నాకొచ్చింది ఏం లేదంటూ?

Chalaki Chanti: ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో కడుపుబ్బ నవ్వించే షో జబర్దస్త్. ఇక ఈ షో చూడని వారు ఉండరు అసలు. జబర్దస్త్ షోలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్లు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

జబర్దస్త్ వేదికగా మల్లెమాల టీం.. ఎంతో మందిని సెలెబ్రేటీలుగా మార్చింది. గతంలో అనేకసార్లు జబర్దస్త్ తమకు లైఫ్ ఇచ్చిందని జబర్దస్త్ లేకపోతే తాము లేమని సుడిగాలి సుధీర్, హైపర్ ఆది అనేక సార్లు వ్యక్తపరిచారు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన కిరాక్ ఆర్ పి లాంటివారు జబర్దస్త్ తమకు లైఫ్ ఇవ్వలేదని గతంలో ఇంటర్వ్యూల ద్వారా చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆర్ పి ఆరోపణలను హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, షేకింగ్ శేషు, మేనేజర్ ఏడుకొండలు ఖండించారు. దీంతో ఈ విషయం కొన్ని రోజులు చల్లబడింది. ఇక తాజాగా చలాకి చంటి ఓ ఇంటర్వ్యూ ద్వారా జబర్దస్త్ తమకు లైఫ్ ఇవ్వలేదని కామెంట్ చేశాడు. జబర్దస్త్ ఆర్టిస్టులకి సినిమా అవకాశాలు రావా? జబర్దస్త్ షోలో సినిమాల పేరుతో ఆర్టిస్టులు మోసపోతున్నారా?

అని యాంకర్ అడిగిన ప్రశ్నకి చలాకి చంటి ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు జబర్దస్త్ వల్ల లైఫ్ రాలేదని తను ముందుగా సినిమాల్లో చేశాకే జబర్దస్త్ లోకి వచ్చానని, తనకు సినిమాల గురించి తెలుసు కాబట్టి తను సినిమాల విషయంలో మోసపోలేదని తీవ్ర వాఖ్యలు చేశారు. ఇప్పుడు చలాకి చంటి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా దుమారం రేపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -