Chandrababu: వైసీపీ నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్.. ఏమైందంటే?

Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పొత్తులకు సిద్ధమైంది.ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తో టిడిపి నేతలు చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశం అవుతున్నారు. అయితే వీరిద్దరూ పొత్తు పెట్టుకుంటున్నట్లు క్లారిటీ రాకపోయినా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసిపోయి సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పట్ల పలువురు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు.ఇలా పొత్తు గురించి క్లారిటీ రాకపోవడంతో ఒకరు సంబరాలు చేసుకోగా మరొకరు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసిపి నాయకులకు కార్యకర్తలకు తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

 

ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షం కురిసి పెద్ద ఎత్తున అన్నదాతలు నష్టపోయారు. అయితే ఈ విషయం ప్రభుత్వానికి ఏమాత్రం పట్టనట్టు లేదు. మంత్రులు కనీసం పొలాలకు వెళ్లి రైతులను పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇక సీఎం సంగతి సరే సరి రజనీకాంత్ ను తిట్టే పని కాదు.. ధాన్యం రైతుల కష్టాలు చూడండి, పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం కాదు…మిర్చి రైతుల బాధలు వినండి. ప్రతిపక్ష నేతల అరెస్టులు, దాడులు కాదు…పొలంలో అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టండి.

 

కర్షకులకు భరోసా ఇచ్చి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చూడండి అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అందే సహాయం అందాలని కోరడం మంచిగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పేరును చంద్రబాబు నాయుడు ప్రస్తావించడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ పై బాబు గారికి ఎందుకంత ప్రేమ అంటూ పలువురు మరోసారి కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -