Chandrababu Naidu – Amit Shah: అమిత్ షాతో బాబు కీలక భేటీ? తెలుగు రాజకీయాల్లో ట్విస్ట్ లు

Chandrababu Naidu – Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. అమిత్ షా టూర్ వేళ తెలుగు రాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ సంచలనాలకు తెరలేపే పరిణామాలకు అమిత్ షా తెలంగాణ టూర్ వేదిక కానుందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అమిత్ షాతో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారనే వార్త సంచలనం రేపుతోంది.

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ పర్యటన వేళ అమిత్ షా బిజీబిజీగా గడపనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయి భవిష్యత్ వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుతో భేటీ కానున్నారు. రామోజీ, అమిత్ షా ఏకాంతంగా భేటీ కానున్నారు. దీంతో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయితే అమిత్ షా, రామోజీరావు భేటీలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉంటారని వార్తలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో జగన్ ను ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ అండదండలు ఉంటే మళ్లీ ఏపీలో అధికారంలోకి రావచ్చని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే బీజేపీతో మళ్లీ దోస్తీకి చంద్రబాబు సిద్దమయ్యారు. టీడీపీ-బీజేపీని కలపడానికి రామోజీరావు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని, అందుకే వారిద్దరు భేటీలో చంద్రబాబు కూడా పాల్గొననున్నారనే ప్రచారం ఊపందుకుంది.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ వేగంగా పావులు కదుపుతుంది. తెలంగాణలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంత ప్రభావం ఉంటుంది. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో తమ పార్టీకి కలిసి వస్తుందని కేంద్ర బీజేపీ నాయకత్వం భావిస్తుంది. అందుకే చంద్రబాబుతో మళ్లీ పొత్తు పెట్టుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీతో పొత్తు తెలంగాణలో బీజేపీకి అనుకూలించడంతో పాటు ఏపీలో టీడీపీతో సీట్లు పంచుకోవడం ద్వారా ఎన్నో కోన్ని సీట్లు సాధించవచ్చు.

దీంతో టీడీపీతో పొత్తుకు బీజేపీ కూడా అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి పొత్తుకు రామోజీరావు మధ్యవర్తిత్వం వహించనున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 1999,2004,2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుని మోదీ, అమిత్ షాలతో చంద్రబాబు శత్రుత్వం పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ వారితో దోస్తీకి రామోజీరావును దూతగా ఉపయోగించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -